వేళాపాలా లేని కరెంటు కోతలు
లో ఓల్టేజీతో దెబ్బతింటున్న మోటార్లు
కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
తడిసి మోపెడవుతున్న మరమ్మతుల ఖర్చు
ఊరూరా ఎండుతున్న పంటలు
వానలు కురిసినా తప్పని ఇబ్బంది
లబోదిబోమంటున్న రైతాంగం
‘‘కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఒక ఫేజులో లోఓల్టే జీ వస్తుంది. దీంతోని మోటార్లు కాలిపోయి వేలకు వేలు కర్సయితున్నయి’’ ఇది సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఒద్దె రవి ఆవేదన. ‘‘ఏడు గంటల కరెంటు అని సెప్పుతున్నరు గని ఆరు గంటలు గూడ సక్కంగ ఇస్తలేరు. ఈ సారి కాలం అయి బోర్లు మంచిగబోస్తున్నయనుకుంటే కరెంటు పరేషాన్ జేత్తాంది’ ఇది మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రైతు రేకులపల్లి మోహన్‌రెడ్డి బాధ.
కామారెడ్డి, న్యూస్‌లైన్ :
ప్రతి ఊరిలోనూ కరెంటు సమస్య రైతుల్ని వేధిస్తోంది. శనివారం కామారెడ్డి, సదాశివనగర్, మాచారె డ్డి మండలాలలోని పలు గ్రామాల లో ‘న్యూస్‌లైన్’ క్షేత్ర స్థాయిలో కరెం టు సమస్యపై పరిశీలన జరిపింది. కామారెడ్డి డివిజన్‌లో 50,795 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా రైతులు భూగర్భజలాలపైనే ఆధార పడి 1.25 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి వానలు బాగా కురవడంతో భూగర్భ జలా లు వృద్ధి చెందాయి. దీంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. చాలా గ్రామాలలో వేస్తున్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు వేశారు.
కునుకు కూడా కరువే
అయితే, కరెంటు సమస్య రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సదాశివనగర్ మండలం మర్కల్, ఉప్పల్‌వాయి, రామారెడ్డి, మాచారెడ్డి మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, అక్కాపూర్, గన్‌పూర్, మాచారెడ్డి, చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లి, పల్వంచ తదితర గ్రామాలలో కరెంటు సమస్యతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. కరెంటు సరఫరాలో సమయపాలన అమలు కావడంలేదని రైతులు తెలి పారు. దీంతో కరెంటు కోసం చేల వద్దనే ఎదురు చూడాల్సి వస్తోందని అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన సందర్భంలో మరమ్మతుల కోసం ఎస్‌పీఎంకు తరలించడానికి, మరమ్మతులకు ఖర్చు మీద పడుతోందన్నారు. మోటార్లు కాలిపోవడంతో కనీసంగా రూ. మూడు వేలు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు.
మాటలకు చేతలకు పొంతన లేదు
విద్యుత్తు సిబ్బంది తెలిపిన విధంగా రైతులు తమ గ్రామంలో ఫలానా సమయానికి కరెంటు ఉంటుందని పొలం వద్దకు వెళితే ఆ సమయంలో కరెంటు రావడం, కొద్ది సేపటికే పోవడం జరుగుతోంది. ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే ‘పైనుంచే పోయింది’ అనే సమాధానం వస్తోంది. కరెంటు పోయి అరగంట, గంటకు వస్తోంది. దీంతో పారిన మడే పారుతోందని రైతులు తెలిపారు. మాటిమాటికీ కరెంటు పోవడం, రావడంతో స్టార్టర్లు మొరాయించి, మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. వాటిని బో ర్ల నుంచి పైకి తీసి, మరమ్మతులు చేయించడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
వేలకు వేలు ఖర్చు
మరమ్మతుల ఖర్చులూ భారంగా మారాయి. మోటార్లను పైకి తీయడానికి, వైండింగుకు వేలకు వేలు వె చ్చించాల్సి వస్తోంది. పంటలు సాగు చేస్తున్న సమయంలోనే ఈ పరిస్థితి ఉంటే, ముందుముందు ఎ లాంటి కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంటుందోనని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సరఫరాలో ఆటంకాలు రావడమే గాకుండా లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతుండడం రైతులను ఇబ్బందులు పెడుతోం ది. మోటార్లు మొరాయించి దెబ్బ తింటున్నాయని ప లువురు పేర్కొన్నారు. విద్యుత్తు ట్రా న్స్‌ఫార్మర్లపై త క్కువ లోడు ఉన్నచోట కూడా లో ఓల్టేజీతో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయని తెలిపారు.
కరెంటు ఎప్పుడస్తుందో, పోతుందో తెలుస్తలేదు
యాసంగి పంటలు ఏస్తున్న కొద్దీ కరెంటు కష్టాలు పెర్గుతున్నయి. కరెంటు ఎప్పు డు అస్తుందో ఎప్పుడు పో తుందో తెలుస్తలేదు. పది దినాల సంది కరెంటు పరేశానీ పెరిగింది. లో ఓల్టేజీతో రెండు సార్లు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. మోటార్లు, స్టార్టర్లు గూడ ఇ బ్బంది పెడుతున్నయి. -ఒద్దె రవి, రైతు, రామారెడ్డి
బోర్లల్ల నీళ్లున్నా.. కరెంటు లేక ఇబ్బంది
ఈ సారి వానలు మంచిగవడ్డయి. బోర్లు మంచిగ బోస్తున్నయి. గని కరంటుతోనే ఇబ్బంది పడుతున్నం. కరెంటుకు టైము లేకుండబోయింది. కరెంటు భయానికే కొంత భూమిని పడావుగ ఉంచినా.
-రేకులపల్లి మోహన్‌రెడ్డి,
మద్దికుంట, మాచారెడ్డి మండలం
పారిన మడే పారుతుంది
కరెంటు రాకడ, పోకడతోని పారిన మడే పారుతుంది. ఏడు గంటలు అస్తదని జెబుతున్నరు గని ఏనాడు కరెంటు సక్కంగ అస్తలేదు. ఒక్కో రోజు ఐదు గంటలు గూడ అస్తలేదు. కరెంటు ఇబ్బంది పెడుతుండడంతోనే నాట్లు ఏసుడు లేటైతుంది.
-పంతుల్‌నాయక్,
రైతు, అన్నారం, మాచారెడ్డి మండలం
కరెంటు పరేషాన్ జేత్తంది
ఒక్కో దినం కరెంటు పరేషాన్ జేత్తంది. వారం పది దినాల సంది కరెంటు ఎపుడు అస్తుందో ఎప్పుడు బోతుందో తెలుస్తలేదు. కరెంటు కోసం గంటల సేపు పొలంకాడ ఉండుడైతుంది. రాత్రి పూట అయితే కరెంటు మీద నమ్ముకం బోయింది. ఏడు గంటలు కరెంటు ఇయ్యాలె.
-మూన్‌సింగ్, రైతు, ఎల్లంపేట, మాచారెడ్డి మండలం
ఒకటి రెండు రోజుల్లో సమస్య పోతుంది
గ్రిడ్‌లో వచ్చిన సమస్యతో కరెంటు సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో కరెంటు కోతలు విధించాల్సి వచ్చింది. సమస్యపై ఉన్నతాధికారులతో ఎప్పటిక ప్పుడు మాట్లాడుతున్నం. ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అవుతుంది.
-రమేశ్,
ట్రాన్స్‌కో డీఈ,కామారెడ్డి
ఏడుపే
Published Sun, Feb 2 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement