జిల్లాలో మాజీల ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయి. జిల్లాలో మావోయిస్టు ఉనికి లేకుం డాపోయినా కొం దరు ‘మాజీ’లు మాత్రం మావోయిస్టుల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో మాజీల ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయి. జిల్లాలో మావోయిస్టు ఉనికి లేకుం డాపోయినా కొం దరు ‘మాజీ’లు మాత్రం మావోయిస్టుల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన మాజీలు ముఠాలుగా ఏర్పడి సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, చందాల వసూళ్లకు పాల్పడుతున్నారు. నక్స ల్స్ కార్యకలాపాలు లేకపోవడంతో పోలీసులు నక్సల్స్‌కు సంబంధిం చిన వ్యవహారాలపై పెద్దగా దృష్టిపెట్టడం లే దు. ఇదే అదనుగా భావించిన కొందరు ‘మాజీ’లు అరాచకాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నా రు. చందాలు ఇవ్వాలంటూ ఇటీవల కామారెడ్డి పట్టణం లో పలువురు వ్యాపారులకు మావోయిస్టుల పేరుతో ము ద్రించిన లెటర్‌ప్యాడ్‌లపై హెచ్చరికలు పంపిన వ్యవహా రంలో పోలీసులు మాజీల ముఠాను పట్టుకున్నారు.
పదేళ్ల క్రితం వరకు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు జో రుగా సాగేవి. కామారెడ్డి ప్రాంతంలోనైతే నక్సల్స్ చెప్పిన ట్లే నడిచేది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం మోపడంతో వందలాది మంది అరెస్టయ్యారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయా యి. అయితే కొందరు ‘మాజీ’లు మాత్రం నక్సల్స్ పేరు తో తమ అరాచకాలను కొనసాగిస్తూ వచ్చారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో భూ కబ్జాలకు పాల్పడడం, సెటిల్‌మెంట్లు చేయడం వంటివి పెరిగాయి. కామారెడ్డికి సమీపంలో ఓ వైద్యుడి కుటుంబానికి చెందిన విలువైన భూమికి సంబంధించి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ నక్సలైట్, దోమకొండకు చెందిన మరొకరితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నించాడు. సదరు డాక్టరు కుటుంబ సభ్యులు గట్టిగా ఎదురు తిరగడంతో తోకముడిచారు.
అదే ముఠా విలువైన స్థలాలపై దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని కబ్జాలకు పాల్పడుతున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి ప్రాంతానికి చెందిన కొందరు మాజీలు భూముల పంచాయతీలు, డబ్బుల సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యాపారులను డబ్బుల కోసం డిమాండ్ చేసిన కేసులో సదాశివనగర్ మండలం కన్నాపూర్‌కు చెందిన మాజీ డిప్యూటీ కమాండర్ తోకల రాజనర్సయ్య అలియాస్ గజేందర్, రెడ్డిపేటకు చెందిన మామిండ్ల బుచ్చిరాజు, ఇస్రోజివాడికి చెందిన మాధూరి శ్రీనివాస్ అలియాస్ లడ్డూ శ్రీనివాస్, మద్దికుంటకు చెందిన గజ్జెల శంకర్ అలి యాస్ లచ్చాపేట్ శ్రీను, కామారెడ్డి ఎస్సీ కాలనీకి చెందిన కొత్తూరి భూమయ్య అలియాస్ దండోర భూమయ్య, ధర్పల్లి మండలం సిర్నపల్లికి చెందిన దండుగ నర్సయ్య అలియాస్ సాయిలు పట్టణంలోని శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన గోవింద రమేశ్, కామారెడ్డికి చెందిన పెయింటర్ ఎల్.ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో ‘మాజీ’ల మరో అరాచకం వెలుగు చూసింది.