కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు క్రియాశీల పాత్ర పోషించారని, రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముందుంటారని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రవీంద ర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు.
తెలంగాణకు 60 శా తం విద్యుత్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ...సకలజనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించి వేతనాలు ఇప్పించడంలో పీఆర్‌టీయూ కృషి ఉందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి కృషి జరగాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, శంక ర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, తాడ్వాయి శ్రీని వాస్, గోవర్ధన్, రవీందర్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణతల్లి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఆచార్య జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
పునర్నిర్మాణంలో పీఆర్‌టీయూ కీలకపాత్ర
Published Wed, Mar 5 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement