prtu teachers
-
ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం
సాక్షి, విద్యారణ్యపురి: ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే వారి మనోభావాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని శాసనమండలి ఫ్లోర్‌లీడర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలో ప్రారంభమైన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంఘాన్ని తాకట్టుపెట్టే స్వార్థపరులం కాదని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర సంఘాలు సోషల్‌మీడియా వేదికగా చేసే విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
హామీల అమలులో సీఎం విఫలం
సాక్షి, సిద్దిపేట: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారని కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గత సంవత్సరం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఒక్క సమస్యను పరిష్కరించక పోవడం సరికాదన్నారు. ఆదివారం స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు సత్యాగ్రహదీక్ష నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు అడుగుతున్న డిమాండ్లు అన్నీ న్యాయమైనవేనని అవి పరిష్కరించే వీలున్నప్పటికి పరిష్కారానికి నోచుకోక పోవడం శోచనీయమన్నారు. ప్రమోషన్లు, సీపీఎస్ రద్దు, సర్వీస్‌రూల్స్, పీఆర్సీ అమలు, స్పెషల్‌టీచర్లకు ఇంక్రిమెంట్ల హామీలు నెరవేర్చాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రాష్ట్రశాఖ పిలుపుమేరకు ఒక్క రోజు సత్యాగ్రహదీక్షను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర బాద్యురాలు లక్కిరెడ్డి విజయ, నాయకులు జయపాల్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఏళ్ల తరబడి నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం తెరమరుగైంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన సవరణ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో దానికోసం పట్టుపడుతున్న ప్రధాన సంఘమైన పీఆర్టీయూ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి వచ్చిన పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినా, హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరుగా, ఎవరి మేనేజ్మెంట్లలో వారికే పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, ఆ అంశాన్ని పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఇందుకోసం 1,09,024 మంది టీచర్లు (ప్రభుత్వ టీచర్లు 10,817 మంది, పంచాయతీరాజ్ టీచర్లు 98,207 మంది) వేచి చూస్తున్నారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీంతో పదోన్నతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ల వారీగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్‌అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. నెలకు రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం వారు 11,363 మంది ఉన్నారని, అందులో 7,010 మంది ప్రస్తుతం పనిచేస్తుండగా, 4,353 మంది రిటైర్ అయ్యారని వివరించారు. ఇందుకు రూ. 54 కోట్లు అవుతుందని సీఎంకు వివరించారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు 10 నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లించాలని కోరారు. టీచర్లకు 3 నెలల మెటర్నిటీ లీవ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు సీఎంకు వివరించారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిచడంతో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు వెల్లడించారు. ఎంఈవో పోస్టులన్నీ మాకే ఇవ్వండి: జీటీఏ మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల కోసం సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తమ మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ మేనేజ్మెంట్ పరిధిలోని ఎంఈవో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు, బీఎడ్ లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను మాతృశాఖలకు పంపించాలని పేర్కొన్నారు. -
పునర్నిర్మాణంలో పీఆర్టీయూ కీలకపాత్ర
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయులు క్రియాశీల పాత్ర పోషించారని, రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముందుంటారని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రవీంద ర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. తెలంగాణకు 60 శా తం విద్యుత్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ...సకలజనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించి వేతనాలు ఇప్పించడంలో పీఆర్టీయూ కృషి ఉందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి కృషి జరగాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, శంక ర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, తాడ్వాయి శ్రీని వాస్, గోవర్ధన్, రవీందర్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణతల్లి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఆచార్య జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.