
పీఆర్‌టీయూ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి ఫ్లోర్‌లీడర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి, విద్యారణ్యపురి: ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే వారి మనోభావాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని శాసనమండలి ఫ్లోర్‌లీడర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలో ప్రారంభమైన పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంఘాన్ని తాకట్టుపెట్టే స్వార్థపరులం కాదని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర సంఘాలు సోషల్‌మీడియా వేదికగా చేసే విమర్శలను
తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.