Teachers Problems
-
ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం
సాక్షి, విద్యారణ్యపురి: ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే వారి మనోభావాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని శాసనమండలి ఫ్లోర్‌లీడర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలో ప్రారంభమైన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంఘాన్ని తాకట్టుపెట్టే స్వార్థపరులం కాదని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర సంఘాలు సోషల్‌మీడియా వేదికగా చేసే విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
మోదం.. ఖేదం
పదిహేనేళ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దంన్నర కాలంగా పదోన్నతులకు నోచుకోకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులకు, పీఈటీలకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూల్ అసిస్టెంట్ హోదా దక్కనుంది. అయితే ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేనందునే ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారు. కరీంనగర్‌ఎడ్యుకేషన్: గత కొంత కాలంగా పదో న్నతులు కల్పించాలని వివిధ తీరుల్లో ఉద్యమాలు చేసిన భాషా పండితులకు ఊరట లభించింది. 2012 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాషా పండితులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే స్పందించిన ప్రభుత్వం నాడు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో చర్చలు జరిపింది. జీవో నెం.17, 18ను తీసుకవచ్చి పదోన్నతులకు పచ్చజెండా ఊపడంతో భాషా పండితులు దీక్షను విరమించారు. ఇంతలోనే సదరు జీవోలపై వేరే ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో భాషా పండితుల పదోన్నతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 15 ఏళ్లుగా వివాదాల పేరిట భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ, వేతన వ్యత్యాసాలు తదితర లాభాలన్నింటిని కోల్పోయి ద్యోగ విరమణ పొందుతున్నారు. ఈ అంశంపై భాషా పండితులు తీవ్ర ఆవేదనకు గురవుతూ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా పండితులను అప్‌గ్రేడ్ చేస్తామని, త్వరలోనే శుభవార్త విననున్నారని సీఎం ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం మళ్లీ భాషా పండితుల పట్ల వివక్షత చూపుతూ ఏడాదిగా కాలయాపన చేయడంతో చేసేదేమీ లేక నిరాశకు గురయ్యారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సీఎంఓ ప్రత్యేక అధికారితో సమావేశమైన సీఎం కేసీఆర్ భాషా పండితుల దస్త్రాన్ని తెప్పించడం వారి సమక్షంలోనే పదోన్నతుల ఫైల్‌పై సంతకాలు చేయడంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. ఉమ్మడి జిల్లాలో 1579 మందికి లబ్ది... ప్రభుత్వం భాషా పండితుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల 1579 మంది ఉపాధ్యాయులకు లబ్ది జరుగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 583 మంది హిందీ భాషోపాధ్యాయులు, 646 మంది తెలుగు ఉపాధ్యాయులు, పీఈటీలు 350 మందికి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. వీరికి స్కూల్ అసిస్టెంట్ హోదా దక్కనుంది. ఎస్జీటీలు సమరానికి సై.. ప్రభుత్వం భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఏకపక్ష నిర్ణయంతో భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించడం పట్ల మండిపడుతున్నారు. కేవలం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ తతంగానికి తెరలేపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే భాషా పండితులు, పీఈటీల ఓట్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 20 సంవత్సరాల సర్వీసుకు పైగా కలిగి ఉన్న ఎస్జీటీలు ఆరు సంవత్సరాల సర్వీసు కలిగి ఉన్న వారి కన్నా వెనుకకు పోయే ప్రమాదంతో పాటు పదోన్నతుల ప్రక్రియ మున్ముందు గందరగోళంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ వర్గాల్లో సింహభాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రభుత్వ నిర్ణయంపై త్వరలోనే న్యాయస్థానాన్ని అశ్రయించడంతో పాటు భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్జీటీలకూ పదోన్నతులు కల్పించాలి కరీంనగర్‌ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఎస్జీటీలను విస్మరించడం బాధాకరమని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి అన్నారు. పదోన్నతుల్లో ఎస్జీటీలను విస్మరించడంపై ఎస్జీటీ యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడం, సమాజ పోకడలకు అనుగుణంగా విద్యావిధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. సమాజం, ప్రభుత్వం, అధికారులు ప్రాథమిక విద్య స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను బాధ్యులు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందని దేశాలు ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో గురుకులాలు దేశానికి ఆదర్శం కాగా, ప్రభుత్వ ప్రాథమిక విద్య మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని విమర్శించారు. అప్‌గ్రేడేషన్ చేసిన పోస్టులలో అర్హతలు గల ఎస్జీటీలకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నతీకరించిన పండిట్ పోస్టులలో అర్హత గల ఎస్జీటీలకు అవకాశం కల్పించి, ప్రతి ప్రాథమిక పాఠశాలకు పీఎస్ హెచ్ఎంను నియమించడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలలో శనివారం, ఈనెల 11న హైదరాబాద్‌లోని కమిషనర్, డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు జి.నాగభూషణం, దాసరి శ్రీనివాస్, బి.శ్రీనివాస్, తిమ్మాపూర్ మండల నాయకులు శేఖర్, సంతోష్, ఉమాకుమారి, గాయత్రీలత, పద్మ, కవితారాణి, గంగయ్య, శ్రీనివాస్, జయశ్రీ, మంజుల, కిరణ్‌కౌర్, అస్రా పాల్గొన్నారు. -
ఊరికి వెళ్లిపోతాం..
జలుమూరు: విభజనతో రెండు రాష్ట్రాలకు అయి న గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ గా యాలకు ఆనవాలుగా ఇరు రాష్ట్రాల్లోనూ వేదనలు, రోదనలు ఇంకా వినిపిస్తున్నాయి. ఆ కోవలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. రాష్ట్రం కలిసి ఉ న్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు సం పాదించిన ఇక్కడి వారు వేరైపోయాక కూడా అక్క డే ఉండిపోయారు. ఎప్పుడెప్పుడు సొంత రాష్ట్రానికి వద్దామా అని ఎదురు చూస్తున్న ఆంధ్రా ఉపాధ్యాయుల ఆశలను ఎవరూ పట్టించుకోవడం లే దు. నాలుగున్నరేళ్లుగా వారు కనిపించిన ప్రతి నా యకుడికీ వినతులు ఇస్తూనే ఉన్నారు. కానీ సర్కా రు మాత్రం స్పందించడం లేదు. తాజాగా శని వారం నాన్‌లోక్‌ల్ టీచర్ అసోసియేషన్(ఎన్ఎల్టీఏ) నాయకులు తునిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించారు. సొంత రాష్ట్రానికి వచ్చేలా సాయం చేయాలని జగన్‌కు విన్నవించినట్లు ఆ సంఘ నా యకులు వాన సూర్యనారాయణ, డి.సురేష్, బి.భాస్కర్, వి.గౌరునాయుడులు తెలిపారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కుటుంబాలకు దూరంగా.. తెలంగాణలో సుమారు 330 మంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. అలాగే అక్కడ తెలం గాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్న హెల్త్‌కార్డులు ఇక్కడ కుటుంబ సభ్యులకు వర్తించడం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులకు కనీసం వైద్యం చేయించలేక వారు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మహిళలకు వివాహాలు, డిప్యుటేషన్లు వంటి సమస్యలతో ఇక్కట్లు పడుతున్నారు. పిల్లల భవిష్యత్ ఏంటి..? మేం జీవిత కాలం తెలంగాణలో ఉండాల్సిందేనా..? ఎవరో చేసిన తప్పునకు మేం బలైపోతున్నాం. మా పిల్లల భవిష్యత్ ఏంటి. జగన్ సార్ ఇచ్చిన హామీతో భరోసా వచ్చింది. –వాన సూర్యనారాయణ, కరవంజ గ్రామం, జలుమూరు, ఎన్ఎల్టీఏ ప్రధాన కార్యదర్శి వివాహాల సమస్య.. అక్కడ లోకల్ నాన్‌లోకల్ అన్న సమస్యతో పాటు వి వాహ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మేం ఉ ద్యోగం చేసేది తెలంగాణలో మా బంధువులు ఉన్నది ఆంధ్రాలో. పెళ్లి విషయంలో ఇదే అడ్డుపడుతోంది. వీటికి పరిష్కారం ఒక్కటే.. మమ్మల్ని ఏపీకి పంపడమే. – జి.తులసి, పాలకొండ, ఎస్జీటీ టీచర్,తెలంగాణ అందరూ ఉన్నా.. అనాథలమే తెలంగాణ నుంచి ఏపీకి రా వాలని పలు మార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా జగన్మోహన్ రెడ్డిని కలి శాం. ఆయన కచ్చితమైన భరోసా ఇచ్చారు. స్వగ్రామం వస్తామని ఆశ ఉంది. ఇక్కడ మా పిల్లలను చదివిస్తే ఇక్కడ కూడా స్థానికేతరులుగా ఉండిపోతాం. అం దరూ ఉన్నా అనాథల్లా మారుతున్నాం. –వి.గౌరునాయుడు, మందరాడ, సంతకవిటి మండలం, ఉపాధ్యాయుడు, తెలంగాణ అన్నీ అవమానాలే తెలంగాణలో ఉద్యోగం సంపాదించి సుమారు 8 ఏళ్లు గడుస్తోంది. విభజన అనంతరం సొంత రాష్ట్రానికి వస్తామని ఆశతో ఎదురు చూశాం. ఆశ నెరవేరలేదు. ఇక్కడ అడుగుఅడుగునా అవమానాలే ఎదుర్కొంటున్నాం. ఎందరో నాయకులకు కలిసి మొరపెట్టుకున్నాం. పని జరగలేదు. జగన్‌తో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – డి.సుధీర్, రేగిడి ఆమదాలవలస, ఉపాధ్యాయుడు, తెలంగాణ -
సీపీఎస్ రద్దు కోసం పోరాటం
కడప ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ రఘురామిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పోరుయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కడప డీసీఈబీలో ప్రచారజాతకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారజాతను నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ జీవితంలో భధ్రతను దెబ్బతీసే సీసీఎస్‌ను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సుబ్రయణ్యంరాజు, సెక్రటరీ విజయ్‌కుమార్, నాయకులు లక్ష్మిరాజా, రఘనాధరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, శివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నిత్యప్రభాకర్, సివిప్రసాద్, సుబ్బరాజు, నరసింహారెడ్డి, గురవయ్య, మహేష్‌బాబు, శ్రీనివాసులరెడ్డి, మణికుమార్, ఖాదర్‌భాష తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలపై పోరుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సహించేది లేదని పీఆర్టీయూ–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు అవసరమైతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ జరిగిన పీఆర్టీయూ 32వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు , నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉపసంహరణ, ఉన్నత పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయించడం, పూర్తిస్థాయిలో హెల్త్‌కార్డుల అమలుకు కృషి చేయడం పీఆర్టీయూ ప్రాధాన్యాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీసు రూల్స్ రూపొందించి, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేసింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పేర్కొంది. 11వ పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది. సమావేశంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ అధ్యక్షుడిగా సరోత్తంరెడ్డి పీఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా పులి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పీఆర్టీయూ రాష్ట కౌన్సిల్ సమావేశం అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికకు నామినేషన్ స్వీకరించారు. ముందస్తు నిర్ణయం మేరకు ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న వారిద్దరూ మరో రెండేళ్లపాటు కొనసాగే నూతన కార్యవర్గం కోసం నామినేషన్ వేశారు. మిగతా వారెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం జరిగే సమావేశంలో వారు ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు తమ కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలంటూ గురువారం తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్లు హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. సర్వీస్ రూల్స్‌ను ప్రకటించి అమలు చేయాలని, బకాయిలను విడుదల చేయాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.దశరథ్‌యాదవ్, నాయకులు భూతం యాకమల్లు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 70 మంది టీచర్లను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.