సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలంటూ గురువారం తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్లు హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. సర్వీస్ రూల్స్‌ను ప్రకటించి అమలు చేయాలని, బకాయిలను విడుదల చేయాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు.
ఈ ధర్నాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.దశరథ్‌యాదవ్, నాయకులు భూతం యాకమల్లు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 70 మంది టీచర్లను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.