సాక్షి, భిక్కనూరు: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అవినీతి పరుల భరతం పట్టాలని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శ్రీ సిద్దరామేశ్వరనగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో గత పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రజలు వీటిని గమనించి గత పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. తాను చేసిన ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పావలావడ్డీని విడుదల చేసిందన్నారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దుతానన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు సింగం శ్రీనివాస్, నాయకులు నాగర్తి నర్సారెడ్డి, ప్రవీణ్‌గౌడ్, రాజిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, బల్ల శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను తరిమికొట్టండి
సాక్షి, దోమకొండ: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల అభ్యర్థులను తరిమి కొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని షేర్‌బీబీపేట, అంచనూరు, గొట్టిముక్కులలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి మహిళలను, యువకులు, వృద్ధులు, రైతులను ఓటు వేయాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన షబ్భీర్‌అలీ, గంప గోవర్థన్‌లు సంపాదనే ధ్యేయంగా పనిచేశారని, ప్రజా సమస్యలను పట్టించుకొలేదని ఆరోపించారు. తాను నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో నిజాయితీగా ఉన్నానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులతో కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పావలావడ్డీ డబ్బులు తాను దీక్ష చేసి ఇప్పించానని ఆయన గుర్తు చేశారు. పార్టీ నాయకులు తేలు శ్రీను, ఆముదాల నరేందర్, కదిరె మోహన్‌రెడ్డి, చింతల రాజేష్ ఉన్నారు.
నియోజకవర్గం రూపురేఖలు మారుస్తా
సాక్షి, బీబీపేట: బీజేపీకీ ఓటు వేసి నన్ని అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని బీజేíపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. మండలంలోని కోనాపూర్, మల్కాపూర్‌ల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారని, ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి చేసింది కనిపిస్తలేదన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఆముదాల నరేందర్, బీజేపీ జిల్లా నాయకులు బెంజరం తిరుపతి రెడ్డి, మండలాధ్యక్షుడు దుంప నర్సింలు, ప్రధాన కార్యదర్శి అంజాగౌడ్, అల్వాల రమణ, నరేష్, నవీన్ రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment