19 మంది అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా అజయ్ జైన్ కొనసాగుతారు. ఇప్పటి వరకూ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన అనంతరామును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.