
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులు బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు. వీరి స్థానాల్లో ఇతర అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.శివశంకర్, దేవాదాయశాఖ కమిషనర్‌గా, కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
శివశంకర్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్.వి. చంద్రవదన్ పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment