హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నారు. కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరుగనుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా రాంగోపాల్, విశాఖ జిల్లా కలెక్టర్‌గా సాల్మన్ ఆరోగ్యరాజ్, నిజమాబాద్ కలెక్టర్‌గా ప్రద్యుమ్నలను నియమించనున్నారు.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, పంచాయతీరాజ్ కమిషనర్‌గా వరప్రసాద్, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌గా రాజీవ్ రంజన్ ఆచార్య, వ్యవసాయ శాఖజాయింట్ సెక్రటరీగా బాలాజీ దిగంబర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా శాంత కుమారిలను నియమించనున్నారు.