సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్‌లు, 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి సోమవారం(నవంబర్ 11) ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా బదిలీ అయిన అధికారుల జాబితాలో ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఆమెను వేరే శాఖకు కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఎవరు.. ఎక్కడికంటే..
- యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్
- బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా శ్రీధర్
- ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రెటరీగా అనిత రామచంద్రన్
- ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా సురేంద్రమోహన్
- ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణభాస్కర్
- ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య
- ఆరోగ్యశ్రీగా సీఈవోగా శివశంకర్
- ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి
- ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్
- పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా శ్రీజన
- లేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి
- జీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment