governmennt
-
TG: ఐఏఎస్‌ల బదిలీ.. స్మితాసబర్వాల్ ఎక్కడికంటే..
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్‌లు, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి సోమవారం(నవంబర్ 11) ఉత్తర్వులు జారీ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా బదిలీ అయిన అధికారుల జాబితాలో ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఆమెను వేరే శాఖకు కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎవరు.. ఎక్కడికంటే..యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా శ్రీధర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రెటరీగా అనిత రామచంద్రన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా సురేంద్రమోహన్ట్రాన్స్కో సీఎండీగా కృష్ణభాస్కర్ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్యఆరోగ్యశ్రీగా సీఈవోగా శివశంకర్ ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మిఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా శ్రీజనలేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తిజీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ -
పందికొక్కులు పాక్‌ను దోచుకుతింటున్నాయి: ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం పాక్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతోంది. కాగా, ఇప్పటికే ఇమ్రాన్‌కు సొంత పార్టీ ఎంపీలు, మిత్రపక్షాల నేతలు కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారు. అయితే, అవిశ్వాసం నేపథ్యంలో ఆదివారం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. విదేశీ శక్తుల డబ్బుతో ఇక్కడి రాజకీయ నాయకులనే వినియోగించి పాక్ విదేశాంగ విధానాన్నే మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద ఓ లేఖ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతోనే పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు డబ్బు బదీలీ చేస్తున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా.. తాను ప్రాణాలతో ఉన్నా లేకున్నా అలాంటి దేశదోహ్రులను విడిచిపెట్టాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు తొత్తులు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా మూడు పందికొక్కులు దేశాన్ని దోచుకుంటున్నాయని పాక్ మాజీ ప్రధానులపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. వైట్‌కాలర్ నేరగాళ్ల కారణంగా పాకిస్థాన్ ఇంకా పేదరికంలోనే ఉందని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ముషారఫ్ లాగా ఇమ్రాన్ ఖాన్ కూడా లొంగిపోవాలని ఈ డ్రామా అంతా చేస్తున్నారని విమర్శించారు. వారు తమ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ ర్యాలీపై పాక్ ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతలు.. ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ వీధుల్లో రక్తపాతం చేయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. Asad Umar: It looks like we will come with 2/3 majority next time Faisal Javed Khan: Unbelievable scenes today Testimonials by @Asad_Umar and @FaisalJavedKhan after seeing the Epic Jalsa Crowd from the main stage! #IamImranKhan pic.twitter.com/14Lbg9mCIp — PTI (@PTIofficial) March 27, 2022 -
'రెవిన్యూ పెరగకపోవడానికి కారణం దోపిడీనే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇసుక దోపిడీపై బుధవారం వాడివేడి చర్చ జరిగింది. గతంతో పోల్చితే ప్రభుత్వం ఇసుక చార్జీలను పెంచినప్పటికీ రెవిన్యూ పెరగలేదంటే.. దానికి కారణం అధికార పార్టీ దోపిడియే అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్య తీసుకుంది, ఎవరిని పట్టుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇసుక వ్యవహారంలో 2000 కోట్ల అవినీతి చోటు చేసుకుందని స్వయానా రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు సభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. రెండేళ్లు అందినకాడికి ఇసుకను దోచేశారన్నారు. దోపిడీకి పాల్పడిన వారిలో అధికార పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.