
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆరగురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి, ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్, సివిల్ సప్లయ్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు పడింది. కలెక్టర్ భారతీ హోలికేరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం జీఏడీకీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
చదవండి: CM Revanth Reddy: మాతో పని చేయడానికి ఇబ్బంది ఉంటే విధుల నుంచి తప్పుకోవచ్చు