హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా రాంగోపాల్, విశాఖ జిల్లా కలెక్టర్‌గా సాల్మన్ ఆరోగ్యరాజ్, నిజమాబాద్ కలెక్టర్‌గా ప్రద్యుమ్నలను నియమించనున్నారు.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, పంచాయతీరాజ్ కమిషనర్‌గా వరప్రసాద్, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌గా రాజీవ్ రంజన్ ఆచార్య, వ్యవసాయ శాఖజాయింట్ సెక్రటరీగా బాలాజీ దిగంబర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా శాంత కుమారిలను నియమించనున్నారు.
పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి, నూజివీడు సబ్ కలెక్టర్‌గా కేవీఎన్ చక్రధరబాబు, భోధన సబ్ కలెక్టర్‌గా హరినారాయణ్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్, నర్సిపట్నం సబ్ కలెక్టర్‌గా టి.శ్వేత, జగిత్యాల సబ్ కలెక్టర్‌గా ఎల్‌ఎస్ బాలాజీరావులు నియమితులైయ్యారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు దేవాదాయ కమీషనర్‌గా నియమితులైయ్యారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా రజత్ కుమార్ షైనీ, ఈపీడీసీఎల్ సీఎండీగా ఎంవీ శేషగిరిబాబు, మునిసిపల్ డెవల్‌మెంట్ డెరైక్టర్‌గా ఇలంబర్తి నియమితులైయ్యారు.