
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భారత్ గుప్తాను బదిలీ చేస్తూ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఎస్పీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను నియమించారు. గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్‌గా జీ నవీన్‌ను బదిలీ చేశారు.