
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. పోస్టింగ్‌ల వివరాలు.. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా (క్రైమ్స్) రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట్ ఎస్పీగా ఎం.చేతన, ములుగు ఎస్పీగా ఎస్‌ఎస్‌పీ గణపతిరావు, మంచిర్యాల డీసీపీగా రక్షిత కే మూర్తి, భద్రాచలం ఏఎస్పీగా రాజేశ్ చంద్ర, ఏటూరునాగారం ఏఎస్పీగా శరత్ చంద్ర పవార్, మహదేవ్‌పూర్ ఎస్‌డీపీవోగా సాయిచైతన్య నియమితులయ్యారు.