
విజయవాడ, సాక్షి: పది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ పేరిట శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్‌కుమార్ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురానా అంకిత్‌లను బదిలీ చేశారు. అలాగే.. ఐపీఎస్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment