కోట్లలో పాత డబ్బు స్వాధీనం.. అరెస్టులు | Rs 5.75 crore in scrapped notes seized, 15 held | Sakshi
Sakshi News home page

కోట్లలో పాత డబ్బు స్వాధీనం.. అరెస్టులు

Published Tue, Jun 6 2017 8:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

కోట్లలో పాత డబ్బు స్వాధీనం.. అరెస్టులు

కోట్లలో పాత డబ్బు స్వాధీనం.. అరెస్టులు

బెంగళూరు: పాత పెద్ద నోట్ల రద్దయి నెలలు గడుస్తున్నా ఇంకా దర్శనం ఇస్తున్నాయి. అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా కోట్లల్లో.. దాదాపు ఇంకెవరి దగ్గరా లేవని అనుకుంటున్నా అక్రమ మార్గాల్లో అవి బయటకు వస్తూనే ఉన్నాయి. దాదాపు రూ.5.75కోట్ల విలువైన పాత నోట్లు మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ ఎస్‌డీ శరణప్ప తెలియజేశారు. తమకు అందిన సమాచారం మేరకు తొలుత భసవనగుడి వద్ద ఉన్న ఓ హోటల్‌ వద్ద ఆపిన కారును తనిఖీచేయగా అందులో రూ.2.15కోట్ల పాతనోట్లు లభించాయి. దీంతో ఓ కారుని, బైక్‌ని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పీఈఎస్‌ కాలేజీ వద్ద మరో వాహనంలో రూ.1.12కోట్లు, గాంధీ బజార్‌లో రూ.50లక్షలు, ఇలా పలు ప్రాంతాల్లో వివిధ వ్యక్తుల వద్ద నుంచి రూ.5కోట్లకు పైగా పాత నోట్లు స్వాధీనం చేసుకొని 15మందిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement