చెత్తలో భారీగా రద్దైన నోట్లు
Published Thu, Jul 27 2017 4:35 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాజ్‌పేయినగర్‌లో రైల్వేగేటు వద్ద చెత్తలో భారీగా రద్దైన నోట్లు బయటపడ్డాయి. చంద గంగుభాయి అనే మహిళకు గురువారం ఉదయం రూ. 16 లక్షల రద్దైన నోట్లు దొరికాయి. వాటిలో 1000, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement