రూ.కోటికిపైగా పాత నోట్లతో పట్టుబడ్డ ముఠా
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దయిన తర్వాత చాలాకాలం తర్వాత భారీ మొత్తంలో పాత నోట్లు బయటపడ్డాయి. రద్దయిన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ ఓ మూఠా హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం 13మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.కోటీ 85లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా పాత నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ నగదుకు ఐదు రెట్ల పెనాల్టీతోపాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి చెప్పారు. మొత్తం పాత వెయ్యి రూపాయల నోట్లు, ఐదువందల నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి నుంచి రెండు కార్లు, 13 సెల్‌ఫోన్లు కూడా లభించినట్లు తెలిపారు.