పాత నోట్లతో విక్రయాలకు పర్మిషన్ ప్లీజ్...
న్యూఢిల్లీ : పాత నోట్లతో మొబైల్ ఫోన్లను కస్టమర్లు కొనుగోలుచేసే విధంగా అనుమతివ్వాలని దేశీయ హ్యాండ్సెట్ల తయారీదారులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ విక్రయాలు పడిపోయి, రోజుకి 50 శాతం రెవెన్యూలను వదులుకోవాల్సిన వస్తున్న నేపథ్యంలో హ్యాండ్సెట్ తయారీదారుల్లో ఆందోళన మొదలైంది. పాత నోట్ల రద్దుతో తమ రెవెన్యూలను రోజుకు రూ.175-200 కోట్ల మేర కోల్పోతున్నామని ప్రభుత్వానికి నివేదించారు. ఆదార్ కార్డులు లేదా వాటర్ కార్డుల ద్వారా విక్రయాలు జరిపేలా తమకు అనుమతివ్వాలని కోరుతూ టెలికాం, ఐటీ, ఆర్థిక శాఖలకు హ్యాండ్ సెట్ తయారీదారులు లేఖ రాశారు.
విక్రయించిన ప్రతి డివైజ్ ఐఎమ్ఈఐ(ఇంటర్నేషనల్ మొబైల్ ఈక్విప్మెంట్ ఐడెంటీ)తో ట్రేస్ అవుతుందని, దీనివల్ల దుర్వినియోగానికి పాల్పడే అవకాశముండదనే వెల్లడించారు. రిటైల్ అవుట్లెట్ల ద్వారా జరిపే మొబైల్ హ్యాండ్సెట్ విక్రయాలు 40-50 శాతం క్రాష్ అయ్యాయని, మొత్తం ఇండస్ట్రి టర్నోవర్లో ఇవి 85 శాతానికి అందిస్తాయని తయారీదారులు పేర్కొన్నారు. ప్రజలకు చేతుల్లోకి సరిపడ నగదు వచ్చేంతవరకు ఈ అమ్మకాలు మరింత పడిపోయే అవకాశముందని ఆవేదన వ్యక్తంచేశాయి. కాగ, ఇండస్ట్రి కలెక్షన్ రోజుకు రూ.350-400 కోట్ల మేర ఉంటుంది. ఇటీవలే ప్రభుత్వం మొబైల్ ఫోన్ రీఛార్జ్లకు పాత నోట్లను వాడుకోవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.