రూ. 69 లక్షల పాత నోట్లు స్వాధీనం
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడులో రూ. 69 లక్షల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దిపాడు సమీపంలో ఓ కారులో పెద్ద ఎత్తున నగదు తరలిస్తుండటంతో పోలీసులు కారును అడ్డుకున్నారు. మొత్తం రూ. 500, 1000 నోట్లతో కూడిన రూ. 69 లక్షలు ఉండటంతో నగదును స్టేషన్‌కు తరలించారు. ఈ నగదు ఒంగోలుకు చెందిన డాక్టర్‌కు సంబంధించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.