
పాత కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తూ..
హైదరాబాద్: పాత కరెన్సీని మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను సైబర్ టవర్స్ సమీపంలో మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఖాతాదారుడికి రూ.2 వేలు మాత్రమే ఏటీఎంల నుంచి వస్తుండగా, ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు దృష్టిసారించారు.
దీని వెనక బ్యాంకు అధికారుల ప్రమేయం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.