రూ. 46 లక్షల పాతనోట్లు స్వాధీనం
Published Wed, Jul 5 2017 11:44 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం రహదారిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 46 లక్షల రద్దైన పెద్దనోట్లతో పాటు 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement