సాక్షి, హైదరాబాద్: సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రోడ్లపై పార్కింగ్.. ఇలా పలు ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులకు చలాన్లు విధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది యువతే. దీంతో వారు ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు తప్పించుకోవడానికి వింత దారులు వెతుకుతున్నారు.
వాహనం నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నంబర్‌ప్లేటు సగానికి విరగ్గొట్టడం, లేదంటే వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తన పాదాన్ని నంబర్ కనిపించకుండా ప్లేటుపై అడ్డంగా పెట్టడం చేస్తున్నారు. చలాన్లు పడకుండా తప్పించుకొనేందుకు యువత చేస్తున్న ఈ వింత ప్రయత్నాలను చూసి అటు పోలీసులు, ఇటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment