
సాక్షి, ఢిల్లీ : ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచడంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పందించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి జరిమానాలను పెంచలేదనీ, తమకు ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమంటూ బుధవారం స్పష్టం చేశారు. అయితే పెంచిన జరిమానాలను రాష్ట్రాలు వాటి అధికార పరిధికి లోబడి తగ్గించుకోవచ్చన్నారు. మరోవైపు భారీ ట్రాఫిక్ జరిమానాలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని గడ్కరీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment