నిజామాబాద్: రాయితీపై ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం బుధ వారం ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు స్పందించడంలేదు. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు తెలుస్తోంది. వాహనా లకు ఉన్న జరిమానాలను ఆర్టీసీ బస్సులపై 90శాతం, టూ వీలర్, త్రీవీలర్ వాహనాలకు 80శాతం, ఫోర్ వీలర్, భారీ వాహనాలపై 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించి నేటి వరకు గడువు విధించింది. 2018 నుంచి 2024 జనవరి 8 నాటికి జిల్లాలో 5 లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 30 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. సోమవారం నాటికి 2.25 లక్షల కేసులకు రూ. 2.50 కోట్లు చెల్లించారు. ఇంకా జిల్లాలో 2.75 లక్షల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
గడువు పెంచాలంటున్న వాహనదారులు
ప్రజాపాలన కార్యక్రమం కారణంగా ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోవడానికి మీ సేవ, ఆధార్ సెంటర్లు ప్రజలతో సందడిగా మారడంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోతున్నామని వాహనాదారులు చెబుతున్నారు. ఆన్‌లైన్, పేటీఎం ద్వారా చలాన్లు చె ల్లించడానికి అవగాహన లేకపోవడంతో చెల్లించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గడువు పెంచితే చెల్లిస్తామని చెబుతున్నారు.
వెంటనే చెల్లించాలి
రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారం ముగుస్తుంది. జిల్లా లోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చలాన్లను వెంటనే చెల్లించుకోవాలి. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు పెంపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.
– నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment