Karnataka allows 50% discount on traffic fines till February 11 - Sakshi
Sakshi News home page

వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

Published Fri, Feb 3 2023 3:17 PM | Last Updated on Fri, Feb 3 2023 9:03 PM

Karnataka Allows 50 Percent Discount Traffic Fines Till February 11 - Sakshi

బెంగళూరు: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి 11 వరకు చలాన్లపై 50 శాతం డిస్కంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వాహనదారులు పేటీఎం, ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. 

అందరికీ న్యాయం చేకూర్చేలా ట్రైఫిక్ ఫైన్లపై రాయితీ కల్పించాలని కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీర్మానం చేసింది.  రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఈ ప్రతిపాదన పంపింది. దీంతో కర్ణాటకవ్యాప్తంగా చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గురువారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రవాణా శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 11 వరకు విధించే ట్రాఫిక్ చలాన్లపై 50శాతం డిస్కంట్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
చదవండి:  దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement