ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్‌లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు.
Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a
— ShaCasm (@MehdiShadan) October 9, 2022
ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర‍్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment