సాక్షి,సుల్తాన్‌బజార్: ఓ ద్విచక్ర వాహనంపై 88 చలాన్లు పెండింగ్‌లో ఉన్న వ్యక్తి ఎట్టకేలకు సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బుధవారం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్‌గంజ్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా (టీ.ఎస్.11.1588) ఈ నెంబర్ గల ద్విచక్రవాహనం అబ్దుల్ రహా్మన్ అనే వ్యక్తిది. కాగా ఇతనిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా ద్విచక్ర వాహనంపై 2019 నుంచి ఇప్పటి వరకు 28 చలాన్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా దానిపై రూ.28,110 వేలు చెల్లించాల్సి ఉంది.
చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
దీంతో కంగుతిన్న పోలీసులు వెంటనే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంపై నెంబర్‌ప్లేట్స్ టాంపరింగ్ స్టిక్కర్స్ పెట్టడంలాంటి దానిపై మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుమన్‌కుమార్ హెచ్చరించారు.
చదవండి: ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment