హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీగ లాగితే..
కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు.
ప్రభుత్వ అకౌంట్లో కాకుండా..
ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు.
మూడు సంవత్సరాల నుండి..
2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు.
ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు..
Comments
Please login to add a commentAdd a comment