palwal village
-
ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే.. కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు. ప్రభుత్వ అకౌంట్లో కాకుండా.. ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి.. 2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు.. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..
చండీగఢ్: హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెంది ఒక గదిలో విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్ ప్రాంతంలో కలకలంగా మారింది. కాగా, కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగానే సాముహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతి చెందిన వారి ముఖాలపై, గొంతులపై కత్తిపోట్లు ఉన్నాయి. కాగా, కుటుంబ పెద్ద మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. చదవండి: Traffic Challan కమిషనర్ ఆఫీస్ ఎదుట బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం -
అనుకోని అతిథి.. ఆరు గంటల విహారం
హరియాణాలోని పల్వాల్ గ్రామం కృష్ణా కాలనీకి ఉదయాన్నే అనుకోని అతిథి వచ్చింది. ఉదయం 7-8 గంటల సమయంలో మూడు నాలుగేళ్ల వయసున్న మగ చిరుతపులి ఒకటి గ్రామం మొత్తం తన ఇష్టం వచ్చినట్లు తిరిగేసింది. దాదాపు ఆరు గంటల పాటు అది ఊళ్లో ఏవేం ఉన్నాయో అన్నీ చూసుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు దాన్ని పట్టుకోగలిగారు. వాళ్లు దాన్ని ఎలా పట్టుకుంటున్నారో చూసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా జనం గుమిగూడారు. చాలామంది తమ పిల్లలను కూడా తీసుకొచ్చి మరీ ఆ చిరుతను చూపించారు. మూడునెలల క్రితం మాండవార్లో మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు కలిసి కూడా చిరుతను పట్టుకోలేకపోవడంతో గ్రామస్థులే దాన్ని పట్టుకుని కొట్టి చంపేవారు. ఈసారి మాత్రం అలా జరగకుండా.. అత్యంత జాగ్రత్తగా చిరుతను అధికారులు పట్టుకున్నారు. కృష్ణకాలనీలోని పార్కులో కొంతమంది ముందుగా దీన్ని చూశారు. వెంటనే వాళ్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈలోపు అది పార్కు నుంచి ఒక ఖాళీ ఇంట్లోకి దూరింది. కాసేపటికి ఆ ఇల్లు నచ్చలేదో ఏమో.. మళ్లీ పార్కుకు వచ్చేసింది. దాంతో అటవీ శాఖాధికారులు దానికి మత్తుమందు ఇచ్చి, పట్టుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పల్వాల్, గుర్గావ్, ఫరీదాబాద్ అటవీశాఖాధికారులు అంతా కలిసి దాన్ని పట్టుకున్నారని గుర్గావ్ డీఎఫ్ఓ శ్యామ్ సుందర్ చెప్పారు. దాన్ని 12 గంటల పాటు పరిశీలించి, ఆ తర్వాత అడవుల్లోకి వదిలిపెడతామన్నారు.