traffic chalan
-
బండి ఖరీదు వేలల్లో.. జరిమానా లక్షల్లో... తప్పెవరిదంటే..
కర్ణాటక: ఆ స్కూటీ ఖరీదు రూ.30 వేలు.. దానికి పడిన జరిమానా రూ. 3.22 లక్షలు. అవును.. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. అయితే దీనిలో అధికారుల తప్పేమీలేదు. సదరు స్కూటీవాహనదారుని నిర్వాకమే ఇంత భారీ జరిమానాకు కారణం. ఈ ఉదంతం బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను 643 సార్లు ఉల్లంఘించిన స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది. ఈ ఘటన ఆర్టీ నగరలో జరిగింది. స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ ద్వారా 643 సార్లు అతిక్రమణలకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ కెమెరాలో ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. దీంతో మొత్తం చలానాలను లెక్కించగా రూ. 3.22 లక్షలుగా తేలింది. ఇక ఆ స్కూటీ విలువ రూ. 30 వేలకు మించదు. ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్ పోలీసులు వెతకడం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ04KF9072తో ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయమయ్యింది. ఈ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్సైట్లో నమోదు చేసింది. -
ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే.. కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు. ప్రభుత్వ అకౌంట్లో కాకుండా.. ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి.. 2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు.. -
యంగ్ హీరో కారుకు ఫైన్.. ఎందుకంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. ఆయన కారును రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేశారంటూ ముంబయి పోలీసులు చలానా విధించారు. ఈ విషయాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే కారు పార్కింగ్ చేసేటప్పడు కార్తీక్ కారు నడపలేదని తెలుస్తోంది. ఇవాళ ముంబయిలోని సిద్ధి వినాయకస్వామి దేవాలయాన్ని సందర్శించగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలోనే సిద్ధివినాయక ఆలయం వెలుపల పార్క్ చేసిన కార్తీక్ ఆర్యన్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ముంబయి పోలీసు సిబ్బంది చలాన్ జారీ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని సినిా డైలాగ్స్లోని రెండు సినిమాలను ప్రస్తావించారు. ట్విటర్లో రాస్తూ..'కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేయబడి ఉంది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించగలడని భావించొద్దు.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో షెహజాదా పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సన్నీ హిందూజా నటించారు. ఆ తర్వాత సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. అనురాగ్ బసుతో ఆషికీ 3, కెప్టెన్ ఇండియా, కబీర్ ఖాన్ చిత్రాల్లో కనిపించనున్నారు. Problem? Problem yeh thi ki the car was parked on the wrong side! Don't do the 'Bhool' of thinking that 'Shehzadaas' can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl — Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023 -
చిట్టి రోబో.. – ద లాయర్
రోబోలు.. డ్యాన్సులు చేస్తున్నాయి.. ఫుట్‌బాల్ ఆడుతున్నాయి.. ఆకలిగా ఉందని హోటల్‌కు వెళ్తే నచ్చినవన్నీ వేడివేడిగా వడ్డించేస్తున్నాయి.. పాటలు పాడుతున్నాయి.. పాఠాలూ చెబుతున్నాయి.. చివరకు చైనాలో ఓ కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ‘వకీల్’ అవతారంలో ప్రజల ముందుకు రాబోతోంది సరికొత్త రోబో. నిజమే.. యువరానర్.. నా క్లెయింట్ ఏ తప్పూ చేయలేదంటూ కోర్టులో వాదించబోతోంది. ఈ విషయాన్ని రోబో లాయర్ ›తయారీ సంస్థ డునాట్ పే ప్రకటించింది. ఎలాంటి రుసుం లేకుండా ట్రాఫిక్ చలానా కేసుల్ని వాదించేందుకు దీన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు అమెరికా కోర్టులో ఈ రోబో లాయర్ మొదటిసారిగా ప్రత్యక్షమవ్వనుంది. మనుషులు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణ రోబో. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధస్సు కలిగిన రోబోలు అడుగుపెట్టేస్తున్నాయి. ఇప్పుడు న్యాయస్థానంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించేందుకు రోబో సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన కేసులన్నీ వాదించేలా ఈ రోబో పట్టు సాధించిందని సంస్థ వ్యవస్థాపకుడు జోషువా బ్రౌడర్ ప్రకటించారు. 2015 నుంచి పరిశోధనలు... జోషువా బ్రౌడర్ 2015లో ‘డునాట్ పే’ అనే లీగల్ సరీ్వసెస్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోబో లాయర్ తయారీపై పరిశోధనలు చేస్తూ.. ఎట్టకేలకు దాన్ని ఆవిష్కరించారు. దీనికి శిక్షణ ఇచ్చేందుకు చాలా సమయం పట్టిందని బ్రౌడర్ చెబుతున్నారు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపిన రెండు కేసులను ఈ రోబో లాయర్ తొలిసారిగా వాదించనుందని ప్రకటించారు. ఇది స్మార్ట్‌ఫోన్ సహాయంతో పనిచేస్తుందని చెప్పారు. కోర్టులో వాదన విన్న తర్వాత.. కౌంటర్‌గా వాదించాల్సిన అంశాలను ‘ఇయర్ ఫోన్’ ద్వారా సూచిస్తుందని.. కేవలం రోబో లాయర్ చెప్పిన విషయాలను మాత్రమే ప్రతివాది కోర్టుకు విన్నవిస్తారని స్పష్టం చేశారు. దీని వినియోగం వల్ల వేగంగా కేసులు పరిష్కారమయ్యే అవకాశముందని.. కోర్టు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. సహేతుక కారణాలు చూపించిన వారికి ఉచితంగా సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించారు. చట్టం ఒప్పుకుంటుందా? వాద, ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకూడదని యూఎస్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రోబోను వినియోగించడం సాధ్యమా అనే అంశంపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. దీనిపై జోషువా స్పందించారు. ‘డునాట్ పే’ అనేది లీగల్ సరీ్వసులకు సంబంధించిన ఆన్లైన్ చాట్‌బాట్ అని స్పష్టం చేశారు. అందువల్ల న్యాయపరంగా వివాదం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూఎస్ సుప్రీంకోర్టులో లాయర్ రోబో చెప్పిన విషయాలను అక్షరం తప్పు లేకుండా చెప్పిన వారికి కోటి డాలర్లు బహుమతిగా ఇస్తానని జోషువా సవాల్ కూడా విసిరారు. భారతదేశంలోని చట్టాల ప్రకారమైతే రోబో లాయర్లను అనుమతించే అవకాశమే లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అడ్వకేట్ చట్టం–1961 ప్రకారం రోబో లాయర్లను అనుమతించే ప్రొవిజన్ లేదని న్యాయవాది నమిత్ సక్సేనా పేర్కొన్నారు. న్యాయవాదులు ఏఐ ద్వారా వారికి అవసరమైన సమాచారాన్ని తీసుకునే వీలుందని న్యాయనిపుణుల అభిప్రాయపడుతున్నారు. - కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) -
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల షాక్.. ఫైన్ కట్టకుంటే మళ్లీ ఫైన్!
సాక్షి, సిటీబ్యూరో: అనునిత్యం ఉల్లంఘనలకు పాల్పడటం, జారీ అయిన ఈ–చలాన్లు పట్టించుకోకుండా వ్యవహరించడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న వాహనచోదకులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే వైలేషన్స్‌కు పాల్పడి, జరిమానాలు చెల్లించని వారికి భారీగా వడ్డించనున్నారు. కేవలం తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఈ విధానం అమలుకానుంది. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్ విభాగం ప్రాథమిక కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనచోదకులకు రూ.100 జరిమానా పడుతోంది. ఇలా జారీ అవుతున్న ఈ–చలాన్లను అనేక మంది చెల్లించట్లేదు. ఇకపై ఒకసారి చలాన్ జారీ అయిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఆ ఈ–చలాన్ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే అప్పుడు విధించే జరిమానా పెరుగుతుంది. రెండోసారికి రూ.200, మూడోసారికి రూ.600 చొప్పున విధిస్తారు. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే మాత్రం రూ.100 చొప్పునే పడుతుంది. ఇదొక్కటే కాదు.. మరికొన్ని తీవ్రమైన ఉల్లంఘనల విషయంలోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ► రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే ద్వికచ్ర వాహనాలు, ఆటోలకు రూ.200, రూ.600, రూ.800 చొప్పున, ► తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు రూ.1000, రూ.1500, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేస్తారు. ► అలాగే ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పార్కింగ్ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.200 (అక్కడ నుంచి ఠాణాకు తరలిస్తే మాత్రం రూ.350), రూ.700, రూ.1000 చొప్పున, తేలికపాటి, భారీ వాహనాలకు రూ.1000, రూ.1200, రూ.1700 చొప్పున విధిస్తారు. ► ఈ విధానం కోసం ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు. దీని కోసం పెద్ద అధ్యయనమే నిర్వహించారు. అందులో రాంగ్ సైడ్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇలా వేర్వేరు సెక్షన్లకు వేర్వేరుగా జరిమానాలు ఉన్నాయి. మరోపక్క ఒకసారి జారీ చేసిన చలాన్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందికి వస్తుందని, దీనికి రూ.500 జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్ చెప్తుంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. ► వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌లతో పాటు సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్ తదితర ఉల్లంఘనకూ ఈ విధానం వర్తిస్తుంది. ఏ వైలేషన్ వల్లనైతే ప్రాణనష్టం, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయో అలాంటి వాటికి వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ లోక్ అదాలత్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ ఈ–చలాన్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: దసరా సెలవులు కుదింపుపై క్లారిటీ వచ్చేసింది -
కేవలం 4 నెలల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎన్ని లక్షలు ఫైన్ కట్టారో తెలుసా!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు స్పీడ్ గన్ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. చదవండి: అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
Traffic Challan Issued To Telangana CS Somesh Kumar Official Vehicle: తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగానే నిబంధనలు పాటించని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. (చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..) హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అధిక వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. చదవండి: సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా? -
ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా!
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించిన వాహనదారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను పాటించకపోతే చలాన్ల రూపంలో పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుంది. ఇంతకీ, చలానా ఎవరు జారీ చేస్తారు? చలానా ఫీజును ఎలా తగ్గించుకోవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారి అపి విధించే జరిమానానే స్పాట్ చలాన్ అంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అతి వేగంగా వెళ్తున్నప్పుడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు, నాన్ పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసిన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న డిజిటల్ కెమెరాతో మీ వాహనాన్ని ఫోటో తీసి అందుకు తగ్గ జరిమానా విధిస్తారు. మీరు అధికారిక వెబ్సైట్లో మీ వాహనంపై విధించిన ఈ- చలాన్‌ను చూసుకోవచ్చు. అక్కడే చలాన్ ఫీజును చెల్లించవచ్చు. ట్రాఫిక్ చలానా విధించే అధికారం కేవలం హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే ఎక్కువ హోదా గల అధికారులకు మాత్రమే ఉంటుంది. మీ వాహనాన్ని ఆపడం లేదా జరిమానా విధించే అధికారం సాధారణ పోలీసు సిబ్బందికి లేదు. కొన్ని పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచకపోయినా తప్పడు ఈ-చలాన్ మీకు వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్ర పోలీసు శాఖకు మెయిల్ పంపించి మీ సమస్యను పరిష్కరించు కోవచ్చు. ఒకవేల మీ వాహనంపై ఎక్కువ మొత్తంలో చలాన్ ఫీజు ఉంటే రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసే లోక్ అదాలత్‌లో మీ చలాన్ ఫీజును తగ్గించమని విజ్ఞప్తి చేయవచ్చు. అలాగే, మీరు కనుక ఈ చలాన్ ను సకాలంలో చెల్లించకపోతే, మీ చలాన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వార మీరు జరిమానా చెల్లించేందుకు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. చదవండి: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేష బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
నంబర్ ప్లేట్ వంచితే క్రిమినల్ కేసు: ట్రాఫిక్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్ ప్లేట్‌కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్‌ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్‌ని మీమ్‌గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరలయ్యింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్‌తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని.. క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి దీనికి రామ్ ‘రెడీ’ సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో వచ్చే సీన్‌ను మీమ్‌గా వాడారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్‌ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్- ‘‘వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి’’ అంటే.. బైక్(బ్రహ్మానందం).. ‘‘వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్’’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలుతోంది. నవ్వు తెప్పిస్తూనే.. జనాల్లో ఆలోచన కలిగేలా ట్వీట్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021 చదవండి: ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..! -
రతన్ టాటా కారు నెంబర్‌తో మహిళ చక్కర్లు?
ముంబయి: దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సంస్థ ఓనర్ రతన్ టాటాకు చెందిన కారు నంబర్ (ఎంహెచ్01 డికె 0111) ప్లేట్‌ను ఉపయోగించిన కారణంగా ముంబయి పోలీసులు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. రతన్ టాటాకు చెందిన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చిన ఈ-చలాన్లు టాటా సన్స్ ఆఫీసుకు వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు.. వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో విచారణ చేపట్టిన ముంబయి పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. ఈ నేరానికి పాల్పడిన కారు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, దీని యజమాని మహిళ అని తరువాత కనుగొనబడింది. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.(చదవండి: వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో) అయితే తన కారు వాహన నంబర్ రతన్ టాటా కారుకు చెందిన విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు చెప్పారు. తన జీవితంలో మంచి జరగాలంటే ఆ నెంబర్ ప్లేట్ ఉండాలని న్యూమరాలజిస్ట్ నిపుణుడు సూచించినట్లు తన విచారణలో పేర్కొంది. ఇప్పుడు రతన్ టాటాకు చెందిన కారుకు వచ్చిన ఈ-చలాన్లు మళ్లీ ఆ మహిళ పేరుపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ-చలాన్లు జారీ చేసిన వివిధ ప్రదేశాల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేయడం ప్రారంభించినప్పుడు ఈమె పేరు(గీతాంజలి సామ్ షా) బయటకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అని పోలీసులు తెలిపారు. -
‘డ్రంకెన్ డ్రైవ్’కి రూ. పది వేలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.. మొన్నటి వరకు రూ.2,000 జరిమానాతోనే సరిపెట్టిన మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ నూతన నిబంధనల ప్రకారం రూ.10,500 జరిమానా వేస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఫలక్‌నుమా, బహదూర్‌పుర, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ ట్రాఫిక్ మొబైల్ కోర్టు గురువారం జరిమానా విధించింది. సైబరాబాద్‌లో రూ.ఐదు వేల ఫైన్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల నుంచి డ్రంకెన్ డ్రైవర్లకు రూ.ఐదు వేల జరిమానా విధిస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు దాదాపు 50 మందికి రూ. 5 వేల చొప్పున జరిమా నా విధించిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో రూ.10,500 జరిమానా తొలిసారిగా 9 మందికి విధించడంతో అక్కడా కూడా ఈ విధానాన్ని ఆయా కోర్టులు అమలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కొత్త జరిమానాల వల్ల డ్రంకన్ డ్రైవ్‌లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
హాఫ్ హెల్మెట్‌కు ఈ–చలాన్ షాక్
గచ్చిబౌలిలో ఉండే అరుణ్ కుమార్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వెళ్లే ఇతడు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు చాలాసార్లు ఈ–చలాన్ విధించారు. ఇలా అయితే కష్టమని.. పోలీస్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు బైక్‌పై వెళ్లేటప్పుడు ‘హాఫ్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్ మాదిరిది) ధరించసాగాడు. తాను హెల్మెట్ ధరిస్తున్నందున చలాన్ రాదనుకున్నాడు. ఓసారి ట్రాఫిక్ పోలీసులు అరుణ్ బైక్ ఆపి తనిఖీ చేయగా.. హెల్మెట్ ధరించడం లేదంటూ పదుల సంఖ్యలో ఈ–చలాన్లు చేతికివ్వడంతో షాక్ తిన్నాడు. సాక్షి,సిటీబ్యూరో: శంషాబాద్‌లో నివాసముండే శివాజీ మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వచ్చి వెళుతుంటాడు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో హెల్మెట్ ధరించని కారణంగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తలకు హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడని శివాజీ.. ‘కన్స్ట్రక్షన్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్)ను ధరించసాగాడు. అయినా శివాజీకి ‘వితవుట్ హెల్మెట్’ అని ఈ–చలాన్లు జారీ అవుతుండడంతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. హాఫ్ హెల్మెట్ క్యాప్‌గా పరిగణిస్తామని షాకిచ్చారు. ...ఈ రెండు కేసుల్లోనే కాదు.. హాఫ్ హెల్మెట్లు వాడుతున్న చాలామంది ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. దీంతో పోలీసులు కనీస పరిజ్ఞానం లేకుండా జరిమానాలు విధిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సమయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము ధరించింది హెల్మెట్ అంటూ పోలీసులతోనే వాదిస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం హెల్మెట్లు ధరిస్తున్నప్పుడు తమకు జరిమానాలు ఎందుకు విధిస్తున్నారంటూ అవేశపడుతున్నారు. అయితే.. ఎంవీయాక్ట్ ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే హెల్మెట్ అని, అది ఉంటేనే ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలు నిలబడతాయని.. క్యాప్ మాదిగా ఉన్నది హెల్మెట్ కిందకు రాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అందుకే చట్టప్రకారం వారికి ‘వితవుట్ హెల్మెట్’ అనే అప్షన్‌తో జరిమానా విధిస్తున్నామంటున్నారు. ‘‘కేవలం ట్రాఫిక్ పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకునేందుకే హాఫ్ హెల్మెట్లను బలవంతంగా ధరిస్తూ నిబంధనలు పాటిస్తున్నామని భావిస్తున్న వాహనదారులు.. ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణానికి ఆ సగం హెల్మెట్లు ఏమాత్రం కనీస రక్షణనివ్వవన్న సంగతి మరిచిపోతున్నారు.’’ వాహనదారులూ.. ఇది మీ మంచికే.. ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేస్తుండడంతో హెల్మెట్లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, చాలా మంది హెల్మెట్ ఉండి వాడకుండా బైక్‌కు వెనకవైపు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఈ విధంగానే గత నెల 29వ తేదీన పులిజా విజయ్, మరో వ్యక్తి అనిల్ కుమార్‌తో కలిసి బుల్లెట్ బైక్ (టీఎస్13ఈఎం 8214)పై వెళుతుండగా అరామ్‌ఘర్ అండర్‌పాస్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని తాకడంతో తలకు తీవ్రగాయాలైన పులిజా విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ తలకు పెట్టుకోవల్సిన హెల్మెట్‌ను బండి వెనకాల తగిలించుకున్నాడు. అదే హెల్మెట్‌ను ధరించి ఉంటే తలకు స్వల్పగాయాలై బయటపడి ఉండేవాడని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ చెప్పారు. గాయాలైన మరోవ్యక్తి అనిల్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఒక్క సంఘటనే కాదు చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ఉండి కూడా ధరించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. వాహనదారులు పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు హాఫ్ హెల్మెట్లు వాడుతున్నారని, ఇది వారికి మంచిది కాదన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఆ హెల్మెట్ గాయాల తీవ్రతను తగ్గించాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజయ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. -
వేగానికి కళ్లెం!
నగరంలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర రహదారుల్లో వేగ పరిమితులు విధించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా యాక్సెస్ కంట్రోల్ లేని మార్గాల్లో గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.లుగా నిర్ణయించారు. డిజైన్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లుగా నిర్ణయించారు. తరచు జరుగుతున్న ప్రమాదాలు.. వాటి ద్వారా ఏయే మార్గాలు ప్రమాదకరంగా ఉన్నాయో ఎంపిక చేయనున్నారు. రవాణా విభాగం, పోలీసులతో కలిసి వేగపరిమితి నిర్ణయించే అధికారం ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లకు అప్పగించింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో స్థానిక పోలీసులు, రవాణా విభాగం అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదకర రహదారుల్ని గుర్తిస్తారు. సదరు మార్గాల్లో వాహన రద్దీ, రోడ్డు వెడల్పు, మలుపులు, రోడ్డు ఎంత దూరం వరకు స్పష్టంగా కనబడుతుంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధిత మార్గాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తారు. తద్వారా తరచూ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న రహదారులను గుర్తించడంతోపాటు అందుకు కారణాలను కూడా తెలుసుకుంటారు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా.. లేక మలుపుల వల్ల ప్రమాదం ఉందా తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని అక్కడ గరిష్ట వేగపరిమితిని నిర్ధారిస్తారు. ఒకవేళ రోడ్డు దెబ్బతినడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే..అవసరమైన మరమ్మతుల్ని జీహెచ్ఎంసీలోని ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్ విభాగాలు చేపడతాయి. జీహెచ్ఎంసీలో అన్ని రోడ్లు వెరసి 9వేల కి.మీ.ల పైచిలుకు రోడ్లుండగా, వీటిల్లో ప్రధాన రహదారుల్లోని మార్గాల్లో దాదాపు 900 కి.మీ.లున్నాయి. వీటిల్లో 320 కి.మీలను హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్)కు తరలించారు. దాని పరిధిలోకి వెళ్లిన మార్గాల్లో వేగపరిమితుల్ని హెచ్ఆర్డీసీఎల్ ఇంజినీర్లు నిర్ధారిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 580 కి.మీ. పరిధిలోని ప్రమాదకర రోడ్లలో వేగపరిమితుల్ని జీహెచ్ఎంసీ ఎస్ఈలు నిర్ధారిస్తారు. వేగపరిమితుల్ని నిర్ధారించాక సదరు వివరాలు తెలిపే బోర్డులు, సైనేజీలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. అంతకుమించి వేగంతో వెళ్లేవారిని గుర్తించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారు. వేగ పరిమితుల్ని అతిక్రమించే వారికి దాదాపు రూ.1400 జరిమానా విధించనున్నట్లు సమాచారం. నగరంలోని రద్దీ రహదారుల్లో వాహనాలు గంటకు 20 కి.మీ.లు మించి వెళ్లే పరిస్థితి లేదు.అవే రహదారుల్లో రాత్రివేళల్లో మాత్రం 80 నుంచి 120 కి.మీల వేగంతో వెళ్తున్న వారున్నారు. రాత్రుళ్లు జరుగుతున్న ప్రమాదాలకు మితిమీరిన వేగమూ కారణమేనని అధికారులు చెబుతున్నారు. -
అదో బీఎండబ్ల్యూ కారు.. ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్..!
సాక్షి, హైదరాబాద్: అదో బీఎండబ్ల్యూ కారు.. ఏపీ28డీఎక్స్6363 నంబర్‌తో కూడిన ఆ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్.. ఇప్పటి వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిపై విధించిన రూ.1,00,450 జరిమానా పెండింగ్‌లో ఉండిపోయింది. హఠాత్తుగా శనివారం ఈ మొత్తం క్లియర్ అయింది. ఆన్లైన్లో సింగిల్ పేమెంట్‌తో జరిమానా మొత్తం చెల్లించేశారు దాని యజమాని. గతేడాది నవంబర్ వరకు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో టాప్–20 ఉల్లంఘనలు చేసిన వాహనాలపై పెండింగ్‌లో ఉన్న జరిమానా రూ.4.8 లక్షలుగా తేలింది. దీని ప్రకారం చూస్తే ఈ వాహనానిదే టాప్ అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ వాహన యజమాని హఠాత్తుగా ఈ మొత్తం చెల్లించడం వెనుక దాన్ని అమ్మాలని భావించడమో, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నోటీసుల ద్వారా ఒత్తిడి చేయడమో కారణమై ఉండవచ్చని నగర పోలీసులు భావిస్తున్నారు. ‘సైబరాబాద్’ పరిధిలోనే అధికం: ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు స్పాట్ చలాన్లు మాత్రమే విధించేవారు. ఈ కారణంగానే అప్పట్లో చలాన్ల పెండెన్సీ అన్నది అరుదుగా ఉండేది. ప్రస్తుతం రాజధానిలో అత్యధికంగా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. దీన్ని సదరు వాహన చోదకుడు ఆన్లైన్లోనో, ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లోనో చెల్లించాల్సి ఉంది. ఈ–చలాన్లను అనేక మంది బేఖాతరు చేస్తుండటంతో పెండెన్సీ పెరిగిపోతోంది. సైబరాబాద్, రాచ కొండల్లో కొరత కారణంగా సరాసరిన ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు ఒక పీడీఏ మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారణం గానే ఓ వాహనంపై ఎన్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయన్నది ఇక్కడ తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ కారణంగానే పెండింగ్ ఈ–చలాన్లలో అత్యధికం సైబరాబాద్, ఆ తర్వాత రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబంధించినవే ఉంటున్నాయి. -
కారులో ట్రిపుల్ రైడింగ్‌కు జరిమానా
పట్నంబజారు : ద్విచక్ర వాహనంపై ముగ్గురు తిరగకూడదు...హెల్మెట్ పెట్టుకోవాలి..అంత వరకు ఓకే.. అయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు వింత నిబంధనలతో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు. కారులో కూడా హెల్మెట్ పెట్టుకోవాలట.. ముగ్గురికి మించి ఎక్కకూడదట..ఇదేంటి అనుకుంటున్నారా..నిజమేనండీ. రోజుకు రెండు వందల కేసులు టార్గెట్...ఎవరెలా నవ్విపోతే నాకేలా...ద్విచక్ర వాహనం అయితే ఏంటీ..కారు అయితే ఏంటీ చలానా కొట్టామా...లేదా ఇదీ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం. వివరాల్లోకెళితే.. గుంటూరు నగరానికి చెందిన ఒక ఎనస్తీషియా డాక్టర్‌కు ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్ పోలీసులు చలానా పంపారు. రూ. 335 ఈ– సేవాలో కట్టాలని. త్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటం వలన జరిమానా విధించినట్లు చలానాలో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వాహనం ఏంటో తెలుసా..? కారు కావటం కొసమెరపు. AP07 CU5994 కారుకు పై విధంగా చలానా పంపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నిస్తే చలానా చెల్లించాల్సిందేననంటూ పోలీసులు సెలవిచ్చారు. నిత్యం టార్గెట్ల మయం.... వాహనం ఫొటో తీసిన తరువాత మీ సేవాకు లింక్ చేస్తారు. ఈ క్రమంలోనై కారు నంబరు చూడకపోవటం ట్రాఫిక్ అధికారుల, సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. నిత్యం రెండు వందల కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. -
భారీ స్పందన
నగర ట్రాఫిక్ మెగా లోక్ ఆదాలత్‌కు విశేష స్పందన లభించింది. గోషా మహల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మెగాలోక్ ఆదాలత్ ప్రారంభం తొలిరోజునే బుధవారం దాదాపు 40 లక్షల ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో