
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.. మొన్నటి వరకు రూ.2,000 జరిమానాతోనే సరిపెట్టిన మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ నూతన నిబంధనల ప్రకారం రూ.10,500 జరిమానా వేస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఫలక్‌నుమా, బహదూర్‌పుర, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ ట్రాఫిక్ మొబైల్ కోర్టు గురువారం జరిమానా విధించింది.
సైబరాబాద్‌లో రూ.ఐదు వేల ఫైన్
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల నుంచి డ్రంకెన్ డ్రైవర్లకు రూ.ఐదు వేల జరిమానా విధిస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు దాదాపు 50 మందికి రూ. 5 వేల చొప్పున జరిమా నా విధించిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో రూ.10,500 జరిమానా తొలిసారిగా 9 మందికి విధించడంతో అక్కడా కూడా ఈ విధానాన్ని ఆయా కోర్టులు అమలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కొత్త జరిమానాల వల్ల డ్రంకన్ డ్రైవ్‌లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment