ముంబయి: దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సంస్థ ఓనర్ రతన్ టాటాకు చెందిన కారు నంబర్ (ఎంహెచ్01 డికె 0111) ప్లేట్‌ను ఉపయోగించిన కారణంగా ముంబయి పోలీసులు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. రతన్ టాటాకు చెందిన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చిన ఈ-చలాన్లు టాటా సన్స్ ఆఫీసుకు వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు.. వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో విచారణ చేపట్టిన ముంబయి పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. ఈ నేరానికి పాల్పడిన కారు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, దీని యజమాని మహిళ అని తరువాత కనుగొనబడింది. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.(చదవండి: వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో)
అయితే తన కారు వాహన నంబర్ రతన్ టాటా కారుకు చెందిన విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు చెప్పారు. తన జీవితంలో మంచి జరగాలంటే ఆ నెంబర్ ప్లేట్ ఉండాలని న్యూమరాలజిస్ట్ నిపుణుడు సూచించినట్లు తన విచారణలో పేర్కొంది. ఇప్పుడు రతన్ టాటాకు చెందిన కారుకు వచ్చిన ఈ-చలాన్లు మళ్లీ ఆ మహిళ పేరుపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ-చలాన్లు జారీ చేసిన వివిధ ప్రదేశాల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేయడం ప్రారంభించినప్పుడు ఈమె పేరు(గీతాంజలి సామ్ షా) బయటకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment