దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించిన వాహనదారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను పాటించకపోతే చలాన్ల రూపంలో పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుంది. ఇంతకీ, చలానా ఎవరు జారీ చేస్తారు? చలానా ఫీజును ఎలా తగ్గించుకోవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారి అపి విధించే జరిమానానే స్పాట్ చలాన్ అంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అతి వేగంగా వెళ్తున్నప్పుడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు, నాన్ పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసిన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న డిజిటల్ కెమెరాతో మీ వాహనాన్ని ఫోటో తీసి అందుకు తగ్గ జరిమానా విధిస్తారు. మీరు అధికారిక వెబ్సైట్లో మీ వాహనంపై విధించిన ఈ- చలాన్‌ను చూసుకోవచ్చు. అక్కడే చలాన్ ఫీజును చెల్లించవచ్చు.
ట్రాఫిక్ చలానా విధించే అధికారం కేవలం హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే ఎక్కువ హోదా గల అధికారులకు మాత్రమే ఉంటుంది. మీ వాహనాన్ని ఆపడం లేదా జరిమానా విధించే అధికారం సాధారణ పోలీసు సిబ్బందికి లేదు. కొన్ని పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచకపోయినా తప్పడు ఈ-చలాన్ మీకు వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్ర పోలీసు శాఖకు మెయిల్ పంపించి మీ సమస్యను పరిష్కరించు కోవచ్చు. ఒకవేల మీ వాహనంపై ఎక్కువ మొత్తంలో చలాన్ ఫీజు ఉంటే రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసే లోక్ అదాలత్‌లో మీ చలాన్ ఫీజును తగ్గించమని విజ్ఞప్తి చేయవచ్చు. అలాగే, మీరు కనుక ఈ చలాన్ ను సకాలంలో చెల్లించకపోతే, మీ చలాన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వార మీరు జరిమానా చెల్లించేందుకు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment