పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వరుస ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడికారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం,గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పై అధికారులు లేని సమయంలో వారి ఛాంబర్‌లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పూజా ఖేడ్కర్ వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు.
తాజాగా ఖేడ్కర్ వినియోగిస్తున్న ఆడికారు 21 సార్లు ట్రాఫిక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటీసుల్లో ఆడికారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వాటిపై రూ.27వేలు జరిమానా చెల్లించాలని పూజా ఖేడ్కర్‌కు అధికారులు నోటీసు జారీ చేశారు .
నిబంధనల్ని ఉల్లంఘించి ‘మీ ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించడం,రెడ్ బీకన్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారు. . అందుకు నోటీసులు ఇచ్చేందుకు ట్రాఫిక్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆసమయంలో ఎవరూ లేరని అధికారులు అన్నట్లు తెలుస్తోంది.
అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఖేడ్కర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, వరుసగా వస్తున్న ఆరోపణలపై విలేకరులు ఆమె స్పందన కోరగా..‘ఈ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ప్రభుత్వ నియమాలు నాకు దీనిపై మాట్లాడేందుకు అనుమతించవు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment