Probationary IAS officer
-
పూజపై డిబార్ వేటు!
సాక్షి, న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించి వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రొబెషనరీ మహిళా ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ విషయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీరియస్‌గా స్పందించింది. ç2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు పంపించింది. ‘‘పరీక్ష రాసే ‘అవకాశాలు’ ఆమె గతంలోనే దాటేశారు. అయినాసరే అర్హత లేకపోయినా గుర్తింపును దాచి తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్స్ రాసి అర్హత సాధించారు’’ అని యూపీఎస్సీ శుక్రవారం తెలిపింది. ‘‘పాత వివరాలతో అదనంగా ఇంకోసారి పరీక్ష రాయలేనని తెల్సుకుని ఉద్దేశపూర్వకంగా తన పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా మార్చేసి గుర్తింపు దాచారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు మా దర్యాప్తులో తేలింది’’ అని యూపీఎస్సీ ప్రకటించింది. తర్వాత ఆమెపై క్రిమినల్ కేసు మోపి సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫోర్జరీ, చీటింగ్, వైకల్య కోటా దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ ఐపీసీ, ఐటీ, డిజబిలిటీ చట్టాల కింద ఢిల్లీ నేరవిభాగ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును మొదలెట్టారు. 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అయిన పూజ మహారాష్ట్రలోని పుణె జిల్లా కలెక్టరేట్లో శిక్షణలో ఉన్నపుడు అదనపు సౌకర్యాలు కావాలని, సొంత కారుకు ఎర్రబుగ్గ తగిలించుకుని తిరిగారు. దీంతో ఆమె సివిల్స్‌లో అర్హత సాధించేందుకు చేసిన నేరాలను మీడియా బహిర్గతంచేసింది. దీంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీచేసింది. యూపీఎస్సీ షోకాజ్ నోటీసు నేపథ్యంలో శుక్రవారం ఆమె వాసిమ్ కలెక్టరేట్లో పదవిని వదిలి వెళ్లిపోయారు. యూపీఎస్సీకి వచ్చే దరఖాస్తుల పరిశీలన సమగ్రస్థాయిలో, మరింత సునిశింతంగా ఉండాలని పూజా ఉదంతం చాటుతోంది. పూజ తండ్రికి తాత్కాలిక ఉపశమనంభూ వివాదంలో తుపాకీతో బెదిరించిన కేసులో జూలై 25వ తేదీదాకా అరెస్ట్ నుంచి పూజ తండ్రి దిలీప్‌కు రక్షణ కల్పిస్తూ పుణె సెషన్స్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో దిలీప్ భార్య మనోరమను మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌చేసి 20వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మనోరమ భార్యకు చెందిన నిర్వహణలోలేని థర్మోవెరిటా ఇండియా అనే ఇంజనీరింగ్ సంస్థను పింప్రి–ఛించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్చేశారు. రూ.2.77 లక్షల ఆస్తి పన్ను బాకీ కట్టనందుకు అధికారులు ఇలా చర్యలకు ఉపక్రమించారు. వైకల్య సర్టిఫికెట్ తీసుకునేటపుడు ఈ సంస్థ చిరునామానే పూజ తన ఇంటి అడ్రస్‌గా పేర్కొన్నారు. -
పూజా ఖేద్కర్ తర్వాత మరో ఐఏఎస్.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు!
దేశంలో బ్యూరోక్రాట్స్ నియామకంపై వరుస వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నెలకొంది. ఐఏఎస్ గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దృష్టిసారించిన ప్రధాని మోదీ కార్యాలయం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.ఈ తరుణంలో తాజాగా మరో మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ సైతం నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. Downfall of UPSC has already begun with Pooja Pooja khedkar, followed by this Abhishek Singh.The main guy dancing has cleared UPSC under Locomotor Disability (PwBD-3) category.For those who don't know what is PwBD-3- Cerebral palsy, Leprosy-cured, Dwarfism, Acid attack… pic.twitter.com/osPKbhs2jc— ShoneeKapoor (@ShoneeKapoor) July 13, 2024అభిషేక్ సింగ్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. యాక్టింగ్‌పై మక్కువతో గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఐఏఎస్ అధికారిగా ఉండగానే అతడు వ్యాయామం చేస్తున్న వీడియోలు కొన్ని వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. కదలికలకు సంబంధించి శారీరక వైకల్యం (లోకో మోటర్ డిసెబిలిటీ) ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించడం... ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే అతడికి దివ్యాంగుల కోటా కింద యూపీఎస్సీ నియామకం జరగడం గమనార్హం. పీడబ్ల్యూబీడీ3 అని పిలిచే ఈ కేటగిరి కింద ఆసిడ్ దాడి బాధితులు మొదలుకొని కండరాల కదలికల్లేని సెర్రబెల్ పాల్సీ వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డవారు. మరుగుజ్జులుగా మిగిలిపోయిన వారు వస్తారు. ఈ కోటా కింద ఐఏఎస్ అయిన అభిషేక్ సింగ్ జిమ్‌లో ఎంచక్కా వ్యాయామాలు చేస్తున్న వీడియోలు బయటపడటంతో యూపీఎస్సీ నియామకాలపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పీడబ్ల్యూబీడీ3 కోటా కిందే ఐఏఎస్‌లో 94వ ర్యాంక్‌ను సాధించడంతో చర్చాంశనీయమైంది.రిజర్వేషన్లకు సపోర్ట్ చేశాననేతాను ఐఏఎస్ సాధించడంపై వస్తున్న ఆరోపణలపై అభిషేక్ సింగ్ స్పందించారు. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.కష్టపడి ఐఏఎస్ సాధించా‘ఇప్పటి వరకు నేను ఎలాంటి విమర్శలు రాలేదు. అయినప్పటికీ నా మద్దతు దారులు అడిగినందుకే ప్రస్తుతం నేను ఐఏఎస్ ఎలా అయ్యారనే ప్రశ్నకు బదులిస్తున్నాను. నేను రిజర్వేషన్లకు సపోర్ట్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించానో అప్పటి నుంచి రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. నేను ఎంతో కష్టపడి, ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాను.రిజర్వేషన్ ద్వారా కాదు’అని ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. भाई दुनिया भर की कहानी लिख दी बस ये नही बताया की कैसे LD जिसके वजह से आपने दिव्यांग कोटा लगाया और IAS बने वो होते हुए भी जिम में वजन उठा रहे हो? थोड़ा ज्ञान साझा कर दो, डॉक्टर भी अध्यन करके दुसरे मरीजों की मदद कर देंगे। pic.twitter.com/EXnFzFD7Us— Roshan Rai (@RoshanKrRaii) July 13, 2024 టాలెంట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పనిలేదు‘ప్రభుత్వ సహాయం లేకుండా యునైటెడ్ బై బ్లడ్, నో షేమ్ మూవ్మెంట్ వంటి నా కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేశాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను నమ్ముతున్నాను, ఆ దిశగా కృషి చేస్తాను. మీకు ప్రతిభ ఉందని భావిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేయండి. వ్యాపారం, క్రీడలు లేదా నటనలో రాణించండి’ అని పిలుపునిచ్చారు. పూజా ఖేద్కర్ ఐఏఎస్ పోస్ట్‌కు ఎసరుట్రైయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ తన చూపు, మానసిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటిని నిర్ధారించడానికి తప్పనిసరి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సింది. కానీ ఆమె హాజరు కాలేదు. ఐఏఎస్‌లో ఉత్తర్ణీత సాధించారు. కాగా, పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో పూజా దోషిగా తేలితే ఆమెను తొలగించే అవకాశం ఉందని సమాచారం. వాస్తవాలను దాచిపెట్టడం, తప్పుగా సూచించడం వంటి ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ చర్యలు కూడా ఎదుర్కోనున్నారు. -
పూజా ఖేడ్కర్ ఉక్కిరిబిక్కిరి.. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్
పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వరుస ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడికారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం,గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పై అధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పూజా ఖేడ్కర్ వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఖేడ్కర్ వినియోగిస్తున్న ఆడికారు 21 సార్లు ట్రాఫిక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటీసుల్లో ఆడికారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వాటిపై రూ.27వేలు జరిమానా చెల్లించాలని పూజా ఖేడ్కర్‌కు అధికారులు నోటీసు జారీ చేశారు .నిబంధనల్ని ఉల్లంఘించి ‘మీ ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించడం,రెడ్ బీకన్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారు. . అందుకు నోటీసులు ఇచ్చేందుకు ట్రాఫిక్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆసమయంలో ఎవరూ లేరని అధికారులు అన్నట్లు తెలుస్తోంది. అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఖేడ్కర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, వరుసగా వస్తున్న ఆరోపణలపై విలేకరులు ఆమె స్పందన కోరగా..‘ఈ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ప్రభుత్వ నియమాలు నాకు దీనిపై మాట్లాడేందుకు అనుమతించవు’అని అన్నారు. -
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
ముంబై : తన గొంతెమ్మ కోర్కెలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ పరీక్ష గట్కెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా..తాజాగా ఆమెకున్న కోట్లలో విలువ చేసే ఆస్తులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ)నాన్ క్లిమిలేయర్ సర్టిఫికెట్లు మరింత భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.పూజా ఖేడ్కర్ ప్రకటన ప్రకారం.. గత ఏడాది తన ఆస్తులు ఎంతున్నాయనే వివరాల్ని జనవరి1,2024 అప్డేట్ చేసింది. వాటి ఆధారంగా పూజా ఖేడ్కర్‌కు మహరాష్ట్రలో సొంతంగా ఐదు ప్లాట్లు,రెండు అపార్ట్మెంట్లు ఉండగా..ఆ మొత్తం స్థిరాస్థుల విలువ రూ.22 కోట్లుగా ఉంది.దీంతో పాటు పూణే జిల్లా మహాలుంగేలో రూ.16 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ధడవాలిలో రూ.4 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, అహ్మద్‌నగర్‌లోని పచుండేలో రూ.25లక్షలు, నందూర్లో రూ.1 కోటి విలువ చేసే ల్యాండ్లు ఉన్నాయి. పచుండే,నందూరులోని ప్లాట్లు ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం మీద ఆమెకు 22 ఎకరాలకు పైగా భూమి ఉంది.అహ్మద్‌నగర్,పూణేలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. అహ్మద్‌నగర్‌లోని సవేదిలో రూ.45లక్షలు విలువ చేసే 984 చదరపు అడుగుల ఫ్లాట్, పూణేలోని కోంధ్వాలోని 724 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం ఆస్తుల ద్వారా ఖేడ్కర్ 2014-2019 మధ్య ఏడాదికి రూ.42 లక్షలు సంపాదించారు.పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ప్రకారం ఆమె తండ్రి ఆస్తుల విలువ రూ.40 కోట్లకు పైమాటే.పైగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా పూజా ఖేడ్కర్ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.