ముంబై : తన గొంతెమ్మ కోర్కెలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ పరీక్ష గట్కెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా..తాజాగా ఆమెకున్న కోట్లలో విలువ చేసే ఆస్తులు, అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఓబీసీ)నాన్ క్లిమిలేయర్ సర్టిఫికెట్లు మరింత భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పూజా ఖేడ్కర్ ప్రకటన ప్రకారం.. గత ఏడాది తన ఆస్తులు ఎంతున్నాయనే వివరాల్ని జనవరి1,2024 అప్‌డేట్ చేసింది. వాటి ఆధారంగా పూజా ఖేడ్కర్‌కు మహరాష్ట్రలో సొంతంగా ఐదు ప్లాట్లు,రెండు అపార్ట్‌మెంట్లు ఉండగా..ఆ మొత్తం స్థిరాస్థుల విలువ రూ.22 కోట్లుగా ఉంది.
దీంతో పాటు పూణే జిల్లా మహాలుంగేలో రూ.16 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ధడవాలిలో రూ.4 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, అహ్మద్‌నగర్‌లోని పచుండేలో రూ.25లక్షలు, నందూర్‌లో రూ.1 కోటి విలువ చేసే ల్యాండ్లు ఉన్నాయి. పచుండే,నందూరులోని ప్లాట్లు ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం మీద ఆమెకు 22 ఎకరాలకు పైగా భూమి ఉంది.
అహ్మద్‌నగర్,పూణేలో రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అహ్మద్‌నగర్‌లోని సవేదిలో రూ.45లక్షలు విలువ చేసే 984 చదరపు అడుగుల ఫ్లాట్, పూణేలోని కోంధ్వాలోని 724 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ విలువ రూ.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ మొత్తం ఆస్తుల ద్వారా ఖేడ్కర్ 2014-2019 మధ్య ఏడాదికి రూ.42 లక్షలు సంపాదించారు.పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ప్రకారం ఆమె తండ్రి ఆస్తుల విలువ రూ.40 కోట్లకు పైమాటే.
పైగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్
ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
కాగా పూజా ఖేడ్కర్ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment