
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా–బొల్లారం చెక్‌పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనచోదకులు ఈ మార్గాన్ని అనుసరించవద్దని సూచిస్తున్నారు.
కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్‌ను ఆశ్రయించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం సూచించారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్‌రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్‌పేట ఓఆర్‌ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్ విగ్రహం, బొల్లారం చెక్‌పోస్టు కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
(చదవండి: కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేస్తున్న చినజీయర్ స్వామి )
Comments
Please login to add a commentAdd a comment