lok adhalath
-
ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా!
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించిన వాహనదారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను పాటించకపోతే చలాన్ల రూపంలో పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుంది. ఇంతకీ, చలానా ఎవరు జారీ చేస్తారు? చలానా ఫీజును ఎలా తగ్గించుకోవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారి అపి విధించే జరిమానానే స్పాట్ చలాన్ అంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అతి వేగంగా వెళ్తున్నప్పుడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు, నాన్ పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసిన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న డిజిటల్ కెమెరాతో మీ వాహనాన్ని ఫోటో తీసి అందుకు తగ్గ జరిమానా విధిస్తారు. మీరు అధికారిక వెబ్సైట్లో మీ వాహనంపై విధించిన ఈ- చలాన్‌ను చూసుకోవచ్చు. అక్కడే చలాన్ ఫీజును చెల్లించవచ్చు. ట్రాఫిక్ చలానా విధించే అధికారం కేవలం హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే ఎక్కువ హోదా గల అధికారులకు మాత్రమే ఉంటుంది. మీ వాహనాన్ని ఆపడం లేదా జరిమానా విధించే అధికారం సాధారణ పోలీసు సిబ్బందికి లేదు. కొన్ని పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచకపోయినా తప్పడు ఈ-చలాన్ మీకు వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్ర పోలీసు శాఖకు మెయిల్ పంపించి మీ సమస్యను పరిష్కరించు కోవచ్చు. ఒకవేల మీ వాహనంపై ఎక్కువ మొత్తంలో చలాన్ ఫీజు ఉంటే రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసే లోక్ అదాలత్‌లో మీ చలాన్ ఫీజును తగ్గించమని విజ్ఞప్తి చేయవచ్చు. అలాగే, మీరు కనుక ఈ చలాన్ ను సకాలంలో చెల్లించకపోతే, మీ చలాన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వార మీరు జరిమానా చెల్లించేందుకు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. చదవండి: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేష బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
విద్యతోనే బంగారు భవిష్యత్తు
సుభాష్‌నగర్ : విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ బంగారుమయమవుతుందని నిజామాబాద్ శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ నూరుల్లా ఘోరి అన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టానికనుగుణంగా నడుచుకోవాలని, చట్టం లేకుంటే అరాచకం రాజ్యమేలుతుందన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, విద్యార్థులు సోదరభావంతో మెలగాలన్నారు. సీనియర్ న్యాయవాది మానిక్‌రాజ్ మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను వినియోగించుకోవాలని, వాటితోపాటు బాధ్యతలను మరువరాదన్నారు. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధిపతి మారయ్యగౌడ్ మాట్లాడుతూ చట్టం ద్వారా లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. సదస్సులో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
కేసుల రాజీతో సమయం సద్వినియోగం
ఒంగోలు సెంట్రల్: లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కె.వి.విజయకుమార్ చెప్పారు. ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం ఆగస్టు 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు సమంజసంగా వ్యవహరిస్తే ఎక్కువ కేసులు పరిష్కారమవుతాయన్నారు. ఈ సందర్బంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యధర్శి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కోర్టుకు కట్టిన ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్ అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, పోలీసుశాఖ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ బి.బి.నాగేంద్రరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి వి.మొహన్‌కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వై.హేమలత, 3వ జూనియర్ సివిల్ జడ్జి జె.శ్రావణ్ కుమార్, బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.c