విద్యతోనే బంగారు భవిష్యత్తు
విద్యతోనే బంగారు భవిష్యత్తు
Published Sat, Aug 13 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
సుభాష్‌నగర్ : విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ బంగారుమయమవుతుందని నిజామాబాద్ శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ నూరుల్లా ఘోరి అన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టానికనుగుణంగా నడుచుకోవాలని, చట్టం లేకుంటే అరాచకం రాజ్యమేలుతుందన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, విద్యార్థులు సోదరభావంతో మెలగాలన్నారు. సీనియర్ న్యాయవాది మానిక్‌రాజ్ మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను వినియోగించుకోవాలని, వాటితోపాటు బాధ్యతలను మరువరాదన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధిపతి మారయ్యగౌడ్ మాట్లాడుతూ చట్టం ద్వారా లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. సదస్సులో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement