బండి ఖరీదు వేలల్లో.. జరిమానా లక్షల్లో... తప్పెవరిదంటే.. | - | Sakshi
Sakshi News home page

బండి ఖరీదు వేలల్లో.. జరిమానా లక్షల్లో... తప్పెవరిదంటే..

Published Tue, Dec 19 2023 12:46 AM | Last Updated on Tue, Dec 19 2023 2:00 PM

- - Sakshi

కర్ణాటక: ఆ స్కూటీ ఖరీదు రూ.30 వేలు.. దానికి పడిన జరిమానా రూ. 3.22 లక్షలు. అవును.. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. అయితే దీనిలో అధికారుల తప్పేమీలేదు. సదరు స్కూటీవాహనదారుని నిర్వాకమే ఇంత భారీ జరిమానాకు కారణం. ఈ ఉదంతం బెంగళూరులో చోటుచేసుకుంది. 

బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్‌ నియమాలను 643 సార్లు ఉల్లంఘించిన స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది. ఈ ఘటన ఆర్‌టీ నగరలో జరిగింది. స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్‌ లేకపోవడం, సిగ్నల్‌ జంప్‌ ద్వారా 643 సార్లు అతిక్రమణలకు పాల్పడ్డాడు. ట్రాఫిక్‌ కెమెరాలో ఇవన్నీ రికార్డ్‌ అయ్యాయి. దీంతో మొత్తం చలానాలను లెక్కించగా రూ. 3.22 లక్షలుగా తేలింది. ఇక ఆ స్కూటీ విలువ రూ. 30 వేలకు మించదు.

ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్‌ పోలీసులు వెతకడం ప్రారంభించారు.  రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ04KF9072తో ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయమయ్యింది.  ఈ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement