
కర్ణాటక: నీ ప్రేయసి హృదయంలో ఉండాలి వాహన నెంబర్ ప్లేట్‌పై కాదని హుబ్లీ ధార్వాడ నగర పోలీసులు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి తన వాహన నెంబర్ ప్లేట్‌పై నెంబర్ నమోదు చేయకుండా ఉన్నందుకు బైక్‌ను స్వాఽ దీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టు నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నారు. తన బైక్ నెంబర్ ప్లేట్‌పై నా ప్రేయసి అని రాసుకొన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు గమనించారు.
ప్లేట్‌పైనా నమోదు సంఖ్య బదులుగా ఈ విధంగా రాయడంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని కోర్టు నోటీసును జారీ చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ వేయించి బైక్ వాహకుడికి చట్టంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ధార్వాడా ట్రాఫిక్ పోలీసులు మీ ప్రేయసి మీ హృదయంలోఉండాలి కాని బైక్ నెంబర్ ప్లేట్‌పై కాదని హితవు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment