Bike number plate
-
పోలీస్ జీప్ నంబర్‌తో మరో బైక్
సిరిసిల్లటౌన్: ఈ ఫొటోలు రెండూ చూశారా.. ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ బోలెరో వాహనం. మరోటి ఖమ్మం జిల్లా జలగంనగర్‌లోని బైక్. ఈరెండు వాహనాల నంబర్లు టీఎస్09పీసీ 4009గా ఉన్నాయి. సాధారణంగా పోలీస్ వాహనాలకు టీఎస్09పీసీ సిరీస్‌తో నంబర్లు అలాట్ అవుతుంటాయి. కానీ, ఖమ్మం జిల్లాలోని జలగంనగర్‌లో కూడా ఓ వ్యక్తి బైక్ నంబరు సిరిసిల్ల పోలీస్ బోలెరో వాహనం ఒకటే కావడం విశేషం. పైగా ఖమ్మంలో ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తుండగా అక్కడి పోలీసులు ఫొటో తీసి ఏప్రిల్ 30న ఆన్లైన్ ద్వారా రూ.100 పెనాల్టీ విధించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్లో బైక్ యజమాని పేరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టీఎస్ ఉండటం విశేషం. అయితే రెండింటిలో ఏది అసలు.. ఏది నకిలీ అనేది తేలాల్సి ఉంది. ఈవిషయమై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా.. ఈఅంశంపై ఖమ్మం పోలీస్ సహకారంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మీ ప్రేయసి మీ హృదయంలో ఉండాలి... బైక్ నెంబర్ ప్లేట్‌పై కాదు...
కర్ణాటక: నీ ప్రేయసి హృదయంలో ఉండాలి వాహన నెంబర్ ప్లేట్‌పై కాదని హుబ్లీ ధార్వాడ నగర పోలీసులు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి తన వాహన నెంబర్ ప్లేట్‌పై నెంబర్ నమోదు చేయకుండా ఉన్నందుకు బైక్‌ను స్వాఽ దీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టు నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నారు. తన బైక్ నెంబర్ ప్లేట్‌పై నా ప్రేయసి అని రాసుకొన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు గమనించారు. ప్లేట్‌పైనా నమోదు సంఖ్య బదులుగా ఈ విధంగా రాయడంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని కోర్టు నోటీసును జారీ చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ వేయించి బైక్ వాహకుడికి చట్టంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ధార్వాడా ట్రాఫిక్ పోలీసులు మీ ప్రేయసి మీ హృదయంలోఉండాలి కాని బైక్ నెంబర్ ప్లేట్‌పై కాదని హితవు చెప్పారు. -
ఉదయ్‌పూర్ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హిందూ టైలర్ కన్హయలాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హంతకులు వినియోగించిన బైక్ నంబర్ ప్లేట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. హంతకుల్లో ఒకరైన రియాజ్ అక్తారీ RJ27AS 2611 అనే బైక్ నంబర్ కోసం రూ. 5,000 అదనంగా చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల బైక్ నెంబర్, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్ర దాడి తేదీ (26/11)తో సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కన్హయ్యలాల్‌ను చంపిన తరువాత నిందితులు ఇదే బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులోని ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ విచారిస్తోంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ దావత్ ఎ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధం ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు అనిమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను గురువారం కోర్టుముందు హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది. చదవండి: నూపుర్ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కాంగ్రెస్ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’ -
ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు
చెన్నై: ఎంతటి వాడైన, ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా వంద మందిపైగా మహిళలను వేధించిన సైకోకి చెన్నై పోలీసులు చెక్ పెట్టారు. నార్త్ జగన్నాధన్నగర్కు చెందిన దినేష్ కుమార్ ఇటీవల ఓ రోజు ఆర్మీ అధికారి కూతురును వేధించడంతో దినేష్ బండారం మొత్తం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని క్యాటరింగ్ కళాశాలలో చదువుతున్న దినేష్ కుమార్, కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులలో పాల్గొంటూ, చెన్నై ఎగ్మోర్ పరిసరాల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే అతను రాత్రి లేదా ఉదయాన్నే ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించేవాడు. ఈ క్రమంలో గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ ఆఫీసర్‌తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా, ఆ సమయంలోనే దినేష్ ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఆ యువతి తన ఇద్దరు కుటుంబ సభ్యుల వెనుక నడుస్తోంది. (చదవండి: Drown In Pond:‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’.. ) దీంతో తను ఒంటరిగా ఉందని భావించి తనతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళ తండ్రి దినేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే అతను బైకు మీద ఉడాయించాడు. ఆర్మీ ఆఫీసర్ అతని బండి నంబర్ని నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతని బండిని ట్రాక్ చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీని పరీశిలించారు. చివరికి అతని ఆచూకి కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఇప్పటివరకూ 100 మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ -
బైకులే వేరు నంబరు ఒక్కటే
విశాఖపట్నం, తగరపువలస: వాహనదారులూ జర జాగ్రత్త. ఇలాంటివి మీకు ఎదురుకావొచ్చు. విషయం ఏమిటంటే...జీవీఎంసీ భీమిలి జోన్ 27వ వార్డు సంగివలస అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన కొయ్యాన శ్రావణ్‌కుమార్ తన ఏపీ 31 ఈజె 2321 నంబరు గల ద్విచక్రవాహనం సీబీ యూనీకార్న్పై ఇటీవల నగరంలో హెల్మెట్ లేకుండా వస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. పోలీసులు నంబర్ నోట్ చేసుకుని అపరాధ రుసుం చెల్లించాలని శ్రావణ్‌కుమార్ ఇంటికి ఇ–చలానా పంపించారు. అందులో ప్రస్తుత జరిమానాతో పాటు గతంలో శ్రీకాకుళంలో చెల్లించిన జరిమానా మరో రెండు బకాయిల అపరాధ రుసుములు చూపించారు. శ్రావణ్ గాని అతని తండ్రి కృష్ణ గాని అంతకు ముందెన్నడూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగాని, అర్హత పత్రాలు లేకుండా గాని అటు రవాణా శాఖ ఇటు ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది లేదు. అయినప్పటికీ బకాయిలు చూపించడంతో వీటిని ఆన్లైన్లో చూసేసరికి తమ వాహనం నంబరే వేర్వేరు ద్విచక్రవాహనాలకు కలిగి ఉండటంతో ఖంగు తిన్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. రవాణా శాఖ ఒకే నంబరును అనేక మందికి జారీ చేసిందా లేదా వేర్వేరు వ్యక్తులు అదే నంబరును దొంగదారిన వినియోగిస్తున్నారా అని తలలు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని వాహనదారుడు శ్రావణ్ కుమార్‌కు హామీ ఇచ్చారు. -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు
గోవిందరావుపేట : ఒకే నంబర్‌తో పల్సర్ టూవీలర్ బండ్లు రెండు కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే చల్వాయికి చెందిన సాయబోయిన భిక్షపతి, మోహన్ అన్నదమ్ములు. భిక్షపతి హన్మకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్దే ఉంటున్న తమ్ముడికి బైక్ కొని ఇచ్చాడు. మోహన్ భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకోగా అతనికి టీఎస్ 25 0468 నెంబర్‌ను కేటాయించారు. ఈ క్రమంలో అదే నెంబర్‌పై హైదరాబాద్‌లో ఓ బ్లాక్పల్సర్ బండిపై మరో వ్యక్తి తిరుగుతున్నాడు. గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు బండి విషయంలో తప్పులు దొర్లడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తూ ఆ నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌లో ఉన్న మోహన్ సెల్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో అన్నయ్య భిక్షపతికి తెలుపగా ఆన్లైన్లో చూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో హెల్మెట్ లేకుండా, నీలోఫర్ ఆస్పత్రి ఎదుట రెండు రోజుల పాటు నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపినందుకు రెండు సార్లు జరిమానాలు విధిస్తున్నట్లు కనిపించింది. దీంతో అవాక్కయిన మోహన్ జరిగిన విషయాలను పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
పట్టుకోండి చూద్దాం..!
నిరంతరం నిఘా నీడలో ఉండే నగరంలో కొందరు వాహనదారులు తప్పుచేసి తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి సీసీ కెమెరాల్లో నమోదైన బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా చలాన్ విధిస్తుంటారు. కానీ కొందరు దీన్నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ బైక్‌ల నెంబర్ ప్లేట్లపై ఉన్న నెంబర్లలో ఒకటి తొలగించడం.. మధ్యలోది చెరిపేయడం, అస్పష్టంగా ఉన్న నెంబర్ ప్లేట్లను బైక్‌లకు బిగిస్తున్నారు. పట్టుబడినప్పుడే దొంగ.. లేకుంటే దొర.. అన్న చందంగా తిరిగేస్తున్నారు. కూకట్పల్లి సర్కిల్లో ఇలాంటి వాహనాలు కోకొల్లలుగా తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు. – ఆల్విన్‌కాలనీ