పట్టుకోండి చూద్దాం..!
నిరంతరం నిఘా నీడలో ఉండే నగరంలో కొందరు వాహనదారులు తప్పుచేసి తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి సీసీ కెమెరాల్లో నమోదైన బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా చలాన్ విధిస్తుంటారు. కానీ కొందరు దీన్నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
తమ బైక్‌ల నెంబర్ ప్లేట్లపై ఉన్న నెంబర్లలో ఒకటి తొలగించడం.. మధ్యలోది చెరిపేయడం, అస్పష్టంగా ఉన్న నెంబర్ ప్లేట్లను బైక్‌లకు బిగిస్తున్నారు. పట్టుబడినప్పుడే దొంగ.. లేకుంటే దొర.. అన్న చందంగా తిరిగేస్తున్నారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో ఇలాంటి వాహనాలు కోకొల్లలుగా తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు. – ఆల్విన్‌కాలనీ