Traffic regulation
-
సీఎం చెప్పినా స్పందన లేదు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు ఎలాంటి ఆదేశాల జారీ చేసినా.. క్షణాల్లో అమలులోకి వస్తాయి. సుదీర్ఘమైన కసరత్తు అవసరమైతే ఆ చర్యలు మొదలువతాయి. అవసరమైతే కమిటీలు, కమీషన్లు ఏర్పాటవుతాయి. అధికారులంతా ఆఘమేఘాల మీద ఉరుకులుపరుగులు పెడతారు. అయితే సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ‘ట్రాఫిక్–ట్రాన్స్జెండర్ల సేవలు’ విషయంలో గత నెల 13న కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి.. ట్రాన్స్‌జెండర్స్ వల్ల సామాన్యులకు ఎదురవుతున్న సమస్యల తొలగింపుతో పాటు వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని యోచించారు. ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడం కోసం పోలీసులు, హోంగార్డ్స్ తరహాలోనే ట్రా¯Œన్స్జెండర్లనూ వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని, ఇలా చేస్తూ ప్రతి నెలా నిరీ్ణత మొత్తం అందిస్తే వారికి కొంత ఉపాధి కల్పింనట్లవుతుందని భావించారు. ప్రత్యేక శిక్షణ, యూనిఫామ్ ఉండాలంటూ... ఈ ప్రతిపాదనల్ని అమలులో పెట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలంటూ గత నెల 13న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతో పాటు ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం కోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని, వారం నుంచి పది రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించాలన్న ముఖ్యమంత్రి కొన్ని నమూనాలను పరిశీలించారు. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ విభాగానికి ఈ ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద ఉపశమనమే లభిస్తుంది. ఇప్పటికే ఆ రెండు నగరాల్లో అమలు... ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం అనేది దేశంలో సరికొత్త విధానమేమీ కాదు. తమిళనాడు రాజధాని చెన్నై ట్రాఫిక్ పోలీసులు 2013లోనే ఈ తరహా ప్రయోగం చేశారు. వన్ ఇండియా రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహాయంతో పది మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా మార్చారు. వారికి నెలకు రూ.9 వేల పారితోషకం అందించారు. 2018లో కర్ణాటకలోని టుమ్కూరు పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించడానికి ట్రాన్స్జెండర్లతో ఓ బృందాన్ని వేర్పాటు చేశారు. వాలంటీర్ల మాదిరిగా వీరికీ పారితోíÙకం అందిస్తూ రహదారులపై సేవలు వినియోగించుకున్నారు. కొచి్చన్ మెట్రో రైల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క అడుగూ వేయని అధికారులు...ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అమలులో పెట్టే దిశలో అధికారులు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. దేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమలులో ఉంది? ఫలితాలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? తదితరాలు అధ్యయనం పైనా దృష్టి పెట్టలేదు. వీరి ఎంపికకు సంబంధించి ట్రాఫిక్ విభాగాలు, ట్రాన్స్జెండర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరపలేదు. ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన ఆచరణ విధివిధానాలను ఏ అధికారీ సమీక్షించలేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సైతం ఈ కోణంలో చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వెళ్లిపోవడం, ప్రస్తుతం బల్దియాకు ఇన్చార్జ్ కమిషనర్ ఉండటంతో ‘ట్రాఫిక్ వాలంటీర్ల’ ప్రతిపాదన పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. -
పట్టుకోండి చూద్దాం..!
నిరంతరం నిఘా నీడలో ఉండే నగరంలో కొందరు వాహనదారులు తప్పుచేసి తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి సీసీ కెమెరాల్లో నమోదైన బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా చలాన్ విధిస్తుంటారు. కానీ కొందరు దీన్నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ బైక్‌ల నెంబర్ ప్లేట్లపై ఉన్న నెంబర్లలో ఒకటి తొలగించడం.. మధ్యలోది చెరిపేయడం, అస్పష్టంగా ఉన్న నెంబర్ ప్లేట్లను బైక్‌లకు బిగిస్తున్నారు. పట్టుబడినప్పుడే దొంగ.. లేకుంటే దొర.. అన్న చందంగా తిరిగేస్తున్నారు. కూకట్పల్లి సర్కిల్లో ఇలాంటి వాహనాలు కోకొల్లలుగా తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు. – ఆల్విన్‌కాలనీ -
‘ప్లేటు’ మారితే వాహనం సీజ్
నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశాలు జారీ ‘నిషా’చరుల రక్తపరీక్షలకూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నగరంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అమల వుతోంది. క్షేత్రస్థాయి అధికారులు నేరుగా జరిమానా లు విధించట్లేదు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్ పంపిస్తున్నారు. వీటిని పంపాలంటే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ నిర్దేశిత ప్రమాణాలతో ఉండటం అవసరం. అలా కానప్పుడు ఈ–చలాన్ చేరకపోవడమో, వేరే వారికి వెళ్లడమో జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న అనేక వాహనాలకు నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ దెబ్బతింటోంది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు.. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. నగరవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ ప్రారంభమైంది. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. మందుబాబులకు బ్లడ్ టెస్టులు సైతం... ఇక నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్‌డ్రైవ్స్‌లో వాహనచోదకుల్ని అవసరమైన సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షిస్తారు. అప్పటికీ వారు సందేహం వ్యక్తం చేస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించడం ద్వారా పరీక్షించాలని నిర్ణయించారు. నిబంధనలు, సూచనలివే.. ► ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ► ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. ► వాహనచోదకులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోని ఆర్టీఏ యాప్‌లో కచ్చితంగా వీటిని కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ్ఠ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ్ఠ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ 120 మిల్లీమీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. అన్ని సర్టిఫికెట్లు ఉండాల్సిందే ‘వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే తక్షణం చలాన్ జారీ చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటాం. వాహనచోదకులు ఆ వాహనా నికి సంబంధించిన ధ్రువీకరణలు తీసుకువచ్చి న తర్వాత పరిశీలిస్తాం. ఆ వాహనం ఇన్సూ రెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకుంటాం. అవి లేకుంటే దానికి సంబంధించి చలాన్ జారీచేసి ఆ మొత్తం వసూలు చేస్తాం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగిస్తాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
సీపీతో మాట్లాడితే శిక్షే!
ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై కమిషనర్‌కు ఫోన్ చేసిన కానిస్టేబుల్ నేరుగా దొరగారికి ఫోన్ చేస్తావా.. అంటూ ఉన్నతాధికారుల వేధింపులు అర్థంతరంగా ఏఆర్‌కు బదిలీ వచ్చే ఏడాది రిటైర్ కానున్న ఆ కానిస్టేబుల్ ‘పోలీసుల పరంగా ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా ఫోన్ చేయండి.. ఏ క్షణంలోైనైనా సమాచారం ఇవ్వండి.. తక్షణం స్పందిస్తాం.. సమస్య పరిష్కరిస్తాం’.. కొత్తగా వచ్చే ఏ పోలీసు అధికారి అయినా చేసే ప్రకటన.. ఇచ్చే హామీ ఇదే. ఇటీవలే నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగానంద్ కూడా ఇటువంటి హామీనే ఇచ్చారు. దీనికి సామాన్య ప్రజల సంగతేమో గానీ.. ముందుగా ఓ పోలీసాయనే స్పందించారు. సీపీకి ఫోన్ చేశారు. ఫలితం.. ఆయన హఠాత్తుగా లూప్లైన్కు బదలీ అయ్యారు. పై అధికారుల నుంచి వేధింపులకు గురయ్యారు. సరిగ్గా మరో ఏడాదిలో రిటైర్ కానున్న ఆ పోలీసాయనకు ఖాకీ బాస్‌లు చుక్కలు చూపిస్తున్నారు. వివరాలేమిటో మీరే చూడండి. విశాఖపట్నం : పరవాడ ట్రాఫిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ పెద్దాయన విధి నిర్వహణలో కొన్నాళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లంకెలపాలెం జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టసాధ్యంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న వందలాది ఫార్మా కంపెనీలకు చెందిన వాహనాలు, జాతీయ రహదారి జంక్షన్ మీదుగా ప్రయాణించే వేలాది లారీల ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ అవసరం అనివార్యమైంది. ఈ విషయమై ఆయన పలుమార్లు తనపై అధికారులకు విన్నవించుకున్నారు. ముందుగా ఎస్ఐకి చెప్పుకున్నారు. ఆ తర్వాత సీఐకు మొరపెట్టుకున్నారు. ఫలితం కానరాకపోవడంతో ఆయనకు సీపీ యోగానంద్ మాటలు గుర్తొచ్చాయి. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నేరుగా కమిషనర్‌కు ఫోన్ చేశారు. సార్.. చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని విన్నవించుకున్నారు. స్పందించిన సీపీ అయ్యో అలాగా.. పక్కనే ట్రాఫిక్ అధికారి ఉన్నారు.. మాట్లాడండి.. అని ఆ ఫోన్ సదరు ట్రాఫిక్ అధికారికి ఇచ్చారు. సమస్య మొత్తం మళ్లీ సదరు ట్రాఫిక్ అధికారికి ఏకరువు పెట్టారు. దొరగారికే చెబుతావా.. నీ సంగతి చూస్తాం.. పెద్ద బాస్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో హమ్మయ్య.. ఇక సమస్య పరిష్కారమైపోతుందని ట్రాఫిక్ కానిస్టేబుల్ భావించాడు. కానీ అప్పటి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. 9వ తేదీ ఉదయం ఎస్సై ఫోన్ చేసి వెంటనే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. ఏం జరిగిందోనని ఆదుర్దాగా వెళ్లిన ఆ కానిస్టేబుల్‌పై అధికారులు తిట్ల దండకం అందుకున్నారు. ‘నువ్వేంటి.. నీస్థాయి ఏమిటి.. నేరుగా దొరగారికే ఫోన్ చేస్తావా.. వెంటనే నీ పాస్‌పోర్టు సరెండర్ చేయి.. స్టేషన్ రికార్డులన్నీ ఇవ్వు .. ఇవాళ నుంచి ఇక్కడొద్దు.. ఏఆర్‌కు పో’.. అని ఈసడించుకున్నారు. సర్.. నేను చేసిన తప్పేంటి దొరగారికి ఫోన్ చేయడమే తప్పయితే తొలి తప్పుగా క్షమించండి.. 59 ఏళ్ల వయసులో ఉన్న నేను ఏఆర్‌లో ఏం చేస్తాను.. వచ్చే జూన్‌లో రిటైర్మెంట్ ఉంది.. అప్పటివరకు ఇక్కడే ఉంచండి.. అని పలుమార్లు ప్రాధేయపడ్డా ఆ అధికారులు కనికరించలేదు. పైగా అతనితో సీపీకి ఫోన్ చేయడం తప్పని లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న సమస్య మీద తమ శాఖకే చెందిన ఓ సీనియర్ ఉద్యోగి సీపీకి ఫోన్ చేయడమే నేరమన్నట్టు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
జనతరంగం
చినుకులన్నీ వాగులై.. ఏరులై.. నదులై.. సాగరాన్ని చేరినట్టు.. అన్నిమార్గాల నుంచి గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. జనతరంగమై పుష్కర ఘాట్లను ముంచెత్తారు. వాతావరణం గంటకో రకంగా మారుతూ హోరు గాలి.. జోరు వాన.. మండే ఎండగా దోబూచులాడినా లెక్కచేయకుండా పుష్కర గోదారి చెంతకు ఉరకలెత్తారు. పశ్చిమాన పవిత్ర నదీ తీరం పుష్కరోత్సవ శోభతో వెలిగిపోయింది. - అదే జోరు.. భక్త జన హోరు - పురోహితులు చాలక పిండ ప్రదానాల కోసం అవస్థలు - ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో ఘాట్ల సమీపానికి వస్తున్న వాహనాలు - కొవ్వూరులో గాలివాన.. భక్తుల ఇక్కట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నా పుష్కర భక్తులు, యాత్రికుల జోరు మాత్రం తగ్గడం లేదు. పుబ్బ నక్షత్రం.. సోమవారం కావడంతో రికార్డు సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మహాశివునికి ఇష్టమైన సోమవారం రోజున పిండ ప్రదానాల సంఖ్య రెట్టింపైంది. తగినంతమంది పురోహితులు లేక జిల్లాలోని చాలా ఘాట్లలో క్రతువుల నిర్వహణకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. శనివారం నాటి రద్దీ ఆదివారం ఒకింత తగ్గినా సోమవారం మాత్రం జనం పోటెత్తారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడం.. ఎక్కడికక్కడ భారీ వాహనాలను మళ్లించడంతో పుష్కర భక్తులు వాహనాల్లో సాఫీగానే ఘాట్ల సమీపానికి చేరుకుంటున్నారు. కొవ్వూరులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన గాలులు, వర్షం యాత్రికులను అవస్థలకు గురి చేశాయి. అన్ని ఘాట్లలోని మెట్లు తడవడం, రోడ్లన్నీ బురదమయంగా మారడంతో స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పుష్కర స్నానం ఆచరించిన మంత్రి మాణిక్యాలరావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ కుటుంబ సభ్యులతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు. పిండప్రదానాలు చేశారు. అనంతరం గోశాలలో గో పూజలు నిర్వహించారు. అనధికార ఘాట్ల మూసివేత ఓ యువకుడి మృతితో అధికారులు కళ్లు తెరిచారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అనధికార ఘాట్లను మూసివేశారు. సిద్ధాంతంలోని కేదారిఘాట్తో పాటు మండలంలో ఉన్న ఇతర ఘాట్లలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. ఉదయం పూట వర్షం కారణంగా భక్తులకు కాస్త అసౌకర్యం కలిగింది. కొనసాగుతున్న లాంచీ ఇబ్బందులు పోలవరంలో భక్తుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలు చేసిన భక్తులు పట్టిసీమ క్షేత్రాన్ని వేలసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో లాం చీలు సమయానికి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. లాంచీల సంఖ్య పెంచాలని పుష్కరాల ప్రారంభం నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముక్కామల బ్రహ్మగుండ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తీపర్రు ఘాట్‌లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడంతో దుర్గంధం వస్తోందని భక్తులు వాపోయారు. బురదలోనే నడక యలమంచిలి మండలం చించినాడ, లక్ష్మీపాలెం ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. చించినాడలో ఘాట్‌కు వెళ్లే రహదారి వర్షం కారణంగా బురదమయంగా మారింది. భక్తులు బురదలోనే నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఘాట్ల వద్ద పురోహితుల సంఖ్య తక్కువగా ఉండటంతో పిండ ప్రదానాల కోసం భక్తులు ఎక్కువ సమయం వేచివుండాల్సి వచ్చింది. శని, ఆదివారాల కంటే భక్తుల రద్దీ తగ్గడంతో ఆచంట, నిడదవోలు మండలాల్లోని ఘాట్లలో స్నానాలు సాఫీగా సాగాయి. -
జామ్.. జామ్..
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తరువాత వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో పుష్కరాల్లో ఐదో రోజైన శనివారం వేల మంది పుష్కర స్నానాలకు తరలి వెళ్లారు. ఉదయం 5 గంటల నుంచి రాజమండ్రి వైపు వెళ్లే మార్గం వాహనాలతో కిక్కిరిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి విజయవాడవైపు వచ్చే మార్గం వాహనాలతో కిటకిటలాడింది. పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామైంది. విజయవాడ నుంచి రాజమండ్రికి సాధారణంగా నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ట్రాఫిక్‌జామ్ కారణంగా ప్రయాణానికి 10 గంటలకు పైగా పడుతోంది. తిరుగు ప్రయాణం ఎక్కువ సమయం పడుతోంది. రైలులో 40 వేల మంది ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు విజయవాడ రైల్వే స్టేషన్ మీదగా రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరు, గోదావరి స్టేషన్లకు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు. రాజమండ్రికి 10 ప్రత్యేక రైళ్లు వేశారు. 20 బోగీలతో వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలు తగిలించారు. రాజమండ్రిలో స్టేషన్లో ఫ్లాట్‌ఫారాలు ఖాళీగా లేకపోవడంతో తాడేపల్లిగూడెం తరువాత ఏ స్టేషన్ ఖాళీగా ఉంటే అక్కడే ప్రత్యేక రైళ్లను ఆపేస్తున్నారు. తాడేపల్లిగూడెం వరకు రెండు గంటల్లో రైలు చేరుకున్నా.. అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు నాలుగు గంటలు పడుతోంది. జనరల్, రిజర్వేషన్ బోగీలు కిటకిటలాడుతున్నాయి. బోగీల్లో చోటులేక ద్వారం వద్దే వెలాడుతూ ప్రయాణిస్తున్నారు. పుష్కర సమాచారం తెలిపేందుకు విజయవాడలో రెండు విచారణ కేంద్రాలు, ఆరు టికెట్ కౌంటర్లను అదనంగా తెరిచారు. బస్సుల్లో 18 వేల మంది ప్రయాణం శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై 120 స్పెషల్ బస్సులకు తోడుగా మరో 250 బస్సులను నడిపారు. శనివారం మధ్యాహ్నానానికి ఒక్క విజయవాడ నుంచే 18వేల మంది ప్రయాణికులు రాజమండ్రి, కొవ్వూరు వెళ్లారని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాజమండ్రిలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన బస్సు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాజమండ్రి వెళ్లిన బస్సులు తిరిగి వస్తే వాటినే తిరిగి ఆదివారం రాజమండ్రికి పంపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోలోని బస్సులు అన్నింటినీ పుష్కరాలకు పంపినందున అదనంగా బస్సులు నడపడం కష్టమంటున్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పుష్కర సాన్నాలకు వెళ్తూనో, లేక తిరుగు ప్రయాణంలోనో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది. ఒక శనివారమే 70 వేల నుంచి 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. కారు కిరాయి భారం సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి రాజమండ్రికి అంబాసిడర్ కారుకు రూ.3 వేలు ఇండికాకు రూ.3,500, టవేరాకు రూ.4,500, ఇన్నోవాకు రూ.5 వేల చొప్పున తీసుకునేవారు. శనివారం అంబాసిడర్‌కు రూ.7వేలు, ఇండికాకు రూ.8వేలు, టవేరా,ఇన్నోవాలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున వసూలు చేశారు. పది నుంచి 15 మంది ప్రయాణించే ట్రావెలర్స్, తుఫాన్ వంటి మినీ బస్సులు, వానులకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ట్రాఫిక్‌జామ్‌లో వాహనాలు చిక్కుకుంటే వెయిటింగ్చార్జీ చెల్లించాలంటూ ట్రావెల్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. టోల్గేట్లు చార్జీలు కూడా ప్రయాణికులే చెల్లించాలని కొంతమంది వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఆదివారం మాటేమిటీ..? ఆదివారం రోజున పుష్కర ట్రాఫిక్ యథాతథంగా కొనసాగుతుందని అంచనా. అయితే ఇప్పటికిప్పుడు రైళ్లు, బస్సుల సంఖ్య పెంచడం సాధ్యం కాదని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.ట్రాఫిక్ జామ్ కారణంగా రాజమండ్రి వైపు వెళ్లడానికి డ్రైవర్లు ముందుకు రావడం లేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు. కీసర వద్ద బారులు తీరిన కార్లు కంచికచర్ల : మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లే కార్లు, ఇతర వాహనాలు శనివారం మండలంలోని కీసరలో స్వర్ణటోల్గేట్ వద్ద బారులుదీరాయి. ఈ ఒక్క రోజు టోల్ గేట్ నుంచి 976 కార్లు వెళ్లాయని, రూ.50 వేల ఆదాయం వచ్చిందని టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. టోల్గేట్ జంక్షన్ జామ్ గన్నవరం : పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనలతో చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి శనివారం కిక్కిరిపోయింది. రామవరప్పాడు నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిం చింది. వాహనాల రద్దీ తెల్లవారుజాము నుంచే మొదలైంది. పొట్టిపాడు టోల్‌గేటు వద్ద ఉదయం మూడు గంటల సమయంలో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఉంగుటూరు పోలీసులు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. టోల్గోటులో వసూలు నిలిపివేసి వాహనాలను వదిలేయడంతో ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది. -
ట్రాఫిక్ చిక్కులకు చెక్
80 వేల ఇళ్లు.. సుమారు 5.20 లక్షల జనాభా... 14 వేల ఆటోలు, అంటే ప్రతి 37 మందికి ఒక ఆటో... ప్రతి ఇంటికీ ఒక ద్విచక్రవాహనం... కార్లు అదనం. వీటికి తోడు ఆర్టీసీ బస్సులు, ప్రైైవేటు వాహనాలు... ఏ చిన్న సందు చూసినా రద్దీ. ప్రధానరోడ్లపై వాహనాలు అడ్డంగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటుంటారు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటపడాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఇదీ అనంతపురం నగర ట్రాఫిక్ దుస్థితి. అనంతపురం క్రైం : రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అంతేస్థాయిలో వివిధ రకాల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలో రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఉన్న రోడ్లను తోపుడుబండ్లు, ఆటోలు ఆక్రమించేయడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీన్ని పరిశీలించిన జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు మెన్‌పవర్ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ఏడుగురు ఎస్ఐలు, 9 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. కూడళ్లలో ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు ప్రస్తుతం నగరంలోని ప్రతి కూడలిలో కనీసం ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఉన్న సిగ్నల్ లైట్లు ఒక రోజు పని చేస్తే వారం రోజులు పనిచేయని స్థితిలో ఉన్నాయి. దీంతో ఆటోమేటిక్ సిగ్నల్‌లైట్లు ఏర్పాటుకు పూనుకున్నారు. నడిమివంక, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, సూర్యానగర్ సర్కిల్, తాడిపత్రి బస్టాండ్ వద్ద ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్ లైట్లలో టైమ్స్, సిగ్నల్స్‌తోపాటు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. దీంతో సిబ్బంది ఉన్నా, లేకపోయినా సిగ్నల్స్ మేరకు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అతిక్రమించినా సీసీ కెమెరాల్లో నమోదవుతాయి. పుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాటి ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొబైల్ పార్టీల గస్తీ ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. మొత్తం 12 మొబైల్ పార్టీలు ఉన్నాయి. ఉదయం ఆరు , మధ్యాహ్నం ఆరు మొబైల్ పార్టీలు పని చేస్తాయి. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మొబైల్ పార్టీలు గస్తీ తిరుగుతూ ట్రాఫిక్‌కు చర్యలు తీసుకుంటుంటారు. -
కానుకల వర్షం
సుదీర్ఘవిరామం తరువాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జయలలిత పోలీస్‌శాఖపై మంగళవారం కానుకల వర్షం కురిపించారు. వరుస ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. చె న్నై, సాక్షి ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు వంటి అనేక బాధ్యతలను పోలీసు శాఖ నిర్వర్తిస్తోంది. అయితే పోలీసులు బాధ్యతలకు తగినట్లుగా శాఖాపరంగా వసతి సౌకర్యాలను కల్పించి సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు, పోలీసు సిబ్బందికి నివాస గృహాలు, గస్తీ విధులకు అనుగుణంగా వాహన సౌకర్యం కల్పించాలని జయలలిత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అందులో పేర్కొన్నారు. 27 జిల్లాల్లో రూ.321 కోట్లతో నిర్మించిన 3918 నివాసగృహాలను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా మదురై నగరంలోని సాయుధ బలగాలకు రూ.20.65 కోట్లతో 226 పోలీస్ వసతి గృహాలను సీఎం జయలలిత మంగళవారం ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. మదురవాయల్, మడిపాక్కం, మదురై తదితర ప్రాంతాల్లో రూ.31 కోట్లతో 68 సముద్రతీర, సాధారణ పోలీస్స్టేషన్లను ఆమె ప్రారంభించారు. అలాగే కాంచీపురం జిల్లా తిరుక్కుళుకున్రం, తిరువన్నామలై జిల్లా సెంగం, కీళ్పెన్నాత్తూరు, కడలూరు జిల్లా పన్రుట్టి, నెల్లికుప్పం, తిరుపూరు జిల్లా పల్లడం తదితర అనేక పట్టణాల్లో రూ.11.38కోట్లతో 130 అగ్నిమాపక, సహాయ కేంద్రాలను అమె ప్రారంభించారు. కేవలం పోలీస్‌శాఖకే మొత్తం రూ.444 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. చెన్నై మాంబళం అనేక వ్యాపార కూడలిగా ఉండటం, అనేక ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లుకు మాంబళం స్టేషన్లో స్టాపింగ్ కలిగి ఉన్న కారణంగా ప్రజల రద్దీని పురస్కరించుకుని కొత్తగా రెండు పోలీస్స్టేషన్లను ఆమె ప్రారంభించారు. అలాగే చెన్నై నగర పోలీస్ కమిషనర్ పరిధిలో సేవలకోసం 52 పోలీస్ జీపులను జయ అందజేశారు. ఈ పోలీస్ జీపులను సముద్రతీరాల్లో గస్తీ కోసం ఉపయోగించేలా తీర్చిదిద్దారు. -
రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానే
జిల్లాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసు, ట్రాఫిక్ అధికారులు నడుంబిగించారు. ముఖ్యంగా కడప నగరంలో విపరీతమైన రద్దీకి.. అడ్డగోలుగా వెళ్లేవారి వాహనదారులకు బ్రేక్ వేసే చర్యలు చేపట్టారు. దీంతోపాటు నగరంలోని పలు విద్యాసంస్థల్లో ట్రాఫిక్‌పై సదస్సులు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నారు. క్రైం (కడప అర్బన్): కడప ట్రాఫిక్ అంటే వాహనదారులు అమ్మో అంటూ హడలెత్తాల్సిందే. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితులతో చెమటలు కక్కాల్సిందే. ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు ఇప్పుడిప్పుడే అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడమేగాక ఎక్కువగా తని ఖీలు చేస్తూ.. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు.. కడప నగర పరిధిలోని పోలీసు అధికారులు ఇటీవల బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. ట్రాఫిక్‌లో ఎలా ఉండాలి.. ఏయే సూచన లు పాటించాలి తదితర విషయాలపై ట్రా ఫిక్ అధికారులు పలుచోట్ల పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యం గా ఆయా విద్యాసంస్థల్లో సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు.