‘ప్లేటు’ మారితే వాహనం సీజ్
- నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి
- స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశాలు జారీ
- ‘నిషా’చరుల రక్తపరీక్షలకూ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నగరంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమల వుతోంది. క్షేత్రస్థాయి అధికారులు నేరుగా జరిమానా లు విధించట్లేదు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్ పంపిస్తున్నారు. వీటిని పంపాలంటే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ నిర్దేశిత ప్రమాణాలతో ఉండటం అవసరం. అలా కానప్పుడు ఈ–చలాన్ చేరకపోవడమో, వేరే వారికి వెళ్లడమో జరుగుతుంది.
ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న అనేక వాహనాలకు నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ దెబ్బతింటోంది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు.. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. నగరవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ ప్రారంభమైంది. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు.
మందుబాబులకు బ్లడ్ టెస్టులు సైతం...
ఇక నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్‌డ్రైవ్స్‌లో వాహనచోదకుల్ని అవసరమైన సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షిస్తారు. అప్పటికీ వారు సందేహం వ్యక్తం చేస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించడం ద్వారా పరీక్షించాలని నిర్ణయించారు.
నిబంధనలు, సూచనలివే..
► ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.
► కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.
► నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం.
► ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు.
► వాహనచోదకులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోని ఆర్టీఏ యాప్‌లో కచ్చితంగా వీటిని కలిగి ఉండాలి.
► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ్ఠ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ్ఠ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ 120 మిల్లీమీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి.
అన్ని సర్టిఫికెట్లు ఉండాల్సిందే
‘వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే తక్షణం చలాన్ జారీ చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటాం. వాహనచోదకులు ఆ వాహనా నికి సంబంధించిన ధ్రువీకరణలు తీసుకువచ్చి న తర్వాత పరిశీలిస్తాం. ఆ వాహనం ఇన్సూ రెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకుంటాం. అవి లేకుంటే దానికి సంబంధించి చలాన్ జారీచేసి ఆ మొత్తం వసూలు చేస్తాం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగిస్తాం’.
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ