రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానే
జిల్లాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసు, ట్రాఫిక్ అధికారులు నడుంబిగించారు. ముఖ్యంగా కడప నగరంలో విపరీతమైన రద్దీకి.. అడ్డగోలుగా వెళ్లేవారి వాహనదారులకు బ్రేక్ వేసే చర్యలు చేపట్టారు. దీంతోపాటు నగరంలోని పలు విద్యాసంస్థల్లో ట్రాఫిక్‌పై సదస్సులు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నారు.
క్రైం (కడప అర్బన్): కడప ట్రాఫిక్ అంటే వాహనదారులు అమ్మో అంటూ హడలెత్తాల్సిందే. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితులతో చెమటలు కక్కాల్సిందే. ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు ఇప్పుడిప్పుడే అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.
పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడమేగాక ఎక్కువగా తని ఖీలు చేస్తూ.. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.
బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు..
కడప నగర పరిధిలోని పోలీసు అధికారులు ఇటీవల బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ..
ట్రాఫిక్‌లో ఎలా ఉండాలి.. ఏయే సూచన లు పాటించాలి తదితర విషయాలపై ట్రా ఫిక్ అధికారులు పలుచోట్ల పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యం గా ఆయా విద్యాసంస్థల్లో సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు.